Venus Transit: తులా రాశిలో శుక్రుడు.. వీరికి భోగభాగ్యాలు, ప్రముఖులుగా గుర్తింపు!

Shukra Gochar 2026: శుక్రుడి రాశి మార్పుతో ఏడు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొందరికి మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతుండగా, మరికొందరికి మహాభాగ్య యోగం పట్టనుంది. దీంతో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ఆ ఏడు అదృష్ట రాశులు ఏవి? వీరికి ఎలాంటి శుభ ఫలితాలు కలగనున్నాయి?

Venus Transit: తులా రాశిలో శుక్రుడు.. వీరికి భోగభాగ్యాలు, ప్రముఖులుగా గుర్తింపు!
Venus Transit 2026

Edited By:

Updated on: Nov 18, 2026 | 7:20 PM

నవంబర్ 5 తేదీ నుంచి తనకు నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు.. ఈ నెల 22 నుంచి జనవరి 2 వరకు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. దీని వల్ల నాలుగు రాశుల వారు భోగభాగ్యాల్లో తులతూగడంతో పాటు, అత్యంత ప్రముఖులుగా గుర్తింపు పొందబోతున్నారు. వీరికి శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం కలుగుతోంది. మరో మూడు రాశులవారికి మహా భాగ్య యోగం పడుతోంది. మేషం, కర్కా టకం, తుల, మకర రాశులవారికి మహా పురుష యోగం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి మహా భాగ్య యోగం పడుతుంది. మొత్తం మీద ఏడు రాశులవారు లబ్ధి పొందబోతున్నారు.

మేషం

ఈ రాశికి సప్తమ కేంద్రంలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం పడుతోంది. ఈ యోగం వల్ల వీరికి ఉద్యోగంలో హోదా పెరగడం, జీతభత్యాలు వృద్ధి చెందడం జరుగుతుంది. వీరి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సత్ఫలితాల నిస్తుంది. సుఖ సంతోషాలతో జీవితం గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.

కర్కాటకం

ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం పట్టి, ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కడం జరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు లభిస్తాయి. పట్టిందల్లా బంగారమవు తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో అధికారం చేపట్టడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి.

కన్య రాశి

ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం కలిగింది. దీనివల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగు తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగాపెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందు తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి.

తులా రాశి

ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీని వల్ల గృహ యోగం ఏర్పడుతుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఆస్తి విలువ అంచనాలకు మించి వృద్ది చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. విదేశాల్లో ఉద్యోగం లభించే యోగం కూడాఉంది.

ధనుస్సు రాశి

ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం కలిగింది. దీనివల్ల ప్రయత్నపూర్వకంగానూ, అప్రయత్నంగానూ సంపన్నులయ్యే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు, సామాజికంగా కూడా హోదా, స్థితిగతులు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభి స్తుంది.

మకర రాశి

ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సమాజ సేవా కార్య క్రమాల్లో విరివిగా పాల్గొంటారు. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు హ్యాపీగా సాగిపోతాయి.

కుంభ రాశి

ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు స్వస్థానంలో సంచారం చేయడం వల్ల మహా భాగ్య యోగం కలిగింది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శుభ కార్యాలకు మార్గం సుగమమ వుతుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us