
జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురు, చంద్రులు, శుక్ర చంద్రులు యుతి చెందడం అనేది అత్యంత శుభప్రదం. చంద్రుడు ఏ గ్రహంతోనైనా కలిసి ఉండడమనేది గరిష్ఠంగా మూడు రోజులే అయినప్పటికీ ఆ మూడు రోజుల్లో సమస్యలు, వివాదాలు, ఆశయాలు, ఆకాంక్షల మీద గానీ దృష్టి కేంద్రీకరించడం వల్ల అవి తప్పకుండా చక్కబడే అవకాశం ఉంటుంది. ఈ నెల (ఆగస్టు) 15, 16, 17 తేదీల్లో కన్యా రాశిలో శుక్ర, చంద్రుల మధ్య జరుగుతున్న యుతి కూడా అటువంటిదే. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులవారు సానుకూల దృక్పథంతో తమ సమస్యల పరిష్కారం మీదా, ఆశయాలు మీదా దృష్టి పెట్టడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల మనసులోని కోరికలు, ఆశయాలు, ఆకాంక్షలు కొద్ది ప్రయత్నంతో చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. పిల్లలకు సంబం ధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. నైపుణ్యాలు పెరుగుతాయి. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభించి ఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర, చంద్రుల సంచారం వల్ల గృహ, వాహనాల కొనుగోలుతో పాటు, ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆస్తి వివాదాలు అనుకూ లంగా పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. వారసత్వపు ఆస్తి లభిస్తుంది. కుటుం బంలో సమస్యలు, విభేదాలు, వివాదాలు తగ్గి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభ కార్యా లకు అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగు తుంది.
ఈ రాశిలో శుక్ర, చంద్రుల యుతి జరగడం ఎంతో అదృష్టదాయకం. ధన, భాగ్య, లాభాధిపతులు ఒకే రాశిలో కలవడం వల్ల ధనలక్ష్మీ యోగం పడుతుంది. అయితే, ఈ రాశివారు తమ నైపుణ్యా లకు, తమలోని ప్రతిభా పాటవాలకు గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఆదాయ వృద్ధికి లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో దూసుకుపోతారు.
ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్ర, చంద్రుల కలయిక వల్ల కెరీర్ పరంగా ఉత్పన్నమవుతున్న సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఉద్యో గంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా చొరవను చూపించాల్సి ఉంటుంది. రిస్కు తీసుకోవడం వల్ల పురోగతి ఉంటుంది. సరైన దిశలో పెళ్లి ప్రయత్నాలు చేసే పక్షంలో ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.
ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర, చంద్రుల యుతి జరగడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు, ఇంటి సరిహద్దు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదాయం వృద్ధి చెందడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు సమసిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు తమ విదేశీ ఉద్యోగ ప్రయత్నాలను సరైన దిశలో కొనసాగించడం వల్ల త్వరలో ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలు న్నాయి.
ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కుటుంబ, దాంపత్య సమస్యల పరి ష్కారానికి సమయం బాగా అనువుగా ఉంది. కొద్ది ప్రయత్నంతో జీవిత భాగస్వామితో మళ్లీ అన్యోన్యత పెరుగుతుంది. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలా పాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి.