Life Progress: ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం మంచి పరిచయాలు, ప్రముఖులతో సంబంధాలు వ్యక్తిగత, వృత్తిపరమైన పురోగతికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా 11వ స్థానం లాభాలు, పరిచయాలు, అవకాశాలకు సూచికగా భావిస్తారు. ప్రస్తుతం మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి మరో 60 రోజుల పాటు లాభ స్థానం అనుకూలంగా ఉండనుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

Life Progress: ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Life Progress

Edited By:

Updated on: Aug 24, 2026 | 3:34 PM

ఆధునిక కాలంలో ఎవరికి ఎటువంటి పరిచయాలు, కనెక్షన్లు ఉన్నాయన్న దాని మీదే జీవిత పురోగతి ఆధారపడి ఉంది. జ్యోతిషశాస్త్రం ఉత్తమ పరిచయాలకు, ఉత్తమ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. జ్యోతిషశాస్త్రాన్ని బట్టి లాభ స్థానం, అంటే 11వ స్థానం లాభదాయక పరిచయాలను, శీఘ్ర పురోగతిని నిర్దేశిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడడం, ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉండడం ఒక వరం. మంచి పరిచయాల వల్ల వ్యక్తిగత పురోగతి సునాయాసంగా సాగుతుంది. ప్రస్తుతం మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి మరో 60 రోజుల పాటు లాభ స్థానం శుభప్రదంగా ఉంది.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల సంపన్నులు, వ్యాపారాలు, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, క్రమంగా సన్నిహిత సంబంధాలుగా మారతాయి. దూసుకుపోయే తత్వం కలిగిన ఈ రాశివారు ఈ పరిచయాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. కొన్ని లాభదాయక పరిచయాలతో ఆదాయపరంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వీరి కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి.
  2. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల తప్పకుండా లాభదాయక పరిచయాలు ఏర్ప డతాయి. ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత, ఉపయోగకర సంబం ధాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ఉద్యో గంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది. ఒక సంపన్నుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. విదేశీ సంపాదనకు అవకాశాలు, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కుదరడం జరుగుతుంది.
  3. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ సంచారం వల్ల తప్పకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో, నాయకులతో, సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఈ పరిచయాలు, సంబంధాల వల్ల వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. అంచనాల్ని మించిన లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకోగలుగుతారు. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల తప్పకుండా ఉన్నత స్థాయి వ్యక్తు లతో, సంపన్నులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల కారణంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి, సంపదను పెంచుకోవడానికి, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. కొందరు శక్తిమంతులైన వ్యక్తులు చేయూతనందిస్తారు. ప్రతి స్నేహమూ లాభదాయకంగా మారే అవకాశం కూడా ఉంది. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి ప్రస్తుతం లాభ స్థానంలో శుక్రుడు, ఆ తర్వాత బుధుడు సంచారం చేయబోతున్నం దువల్ల వ్యాపారాలు, సంపన్నులతో సంబంధాలు వృద్ది చెందుతాయి. వీరి జీవితంలోకి ఒకరిద్దరు ప్రముఖులు ప్రవేశించే అవకాశం ఉంది. పరిచయాల పరంగా ఈ రాశివారికి మంచి అదృష్టం పడుతుంది. విభిన్న వర్గాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు కలగడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కూడా స్నేహాల వల్ల లబ్ధి పొందుతారు.
  7. మీనం: ఈ రాశికి లాభ స్థానం మీద గురు, శనుల బలమైన దృష్టి పడినందువల్ల సంపన్నులతో, వ్యాపారవేత్తలతో బాగా సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు కలుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందడంతో పాటు, జీవనశైలి కూడా పూర్తిగా మారడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల తీరు మారిపోతుంది.
Loading...
Unable to load recommendations.
Follow Us