Surya Nakshatra Transit: రవి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు ధనలాభం, గౌరవం పెరిగే అవకాశం!

Surya Nakshatra Transit 2026: ప్రస్తుతం మఘ నక్షత్రంలో సంచరిస్తున్న రవి.. 2026 ఆగస్టు 31న పుబ్బ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబర్ 13 వరకు ఈ నక్షత్రంలోనే సంచరించనున్నాడు. శుక్రుడి అధిపత్యంలోని పుబ్బ నక్షత్రంలో రవి సంచారం వల్ల మేషం, సింహం, తుల, మీన రాశుల వారికి ధనలాభం, ఉద్యోగంలో పురోగతికి అవకాశముంది. అలాగే గౌరవం పెరగడం, కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

Surya Nakshatra Transit: రవి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు ధనలాభం, గౌరవం పెరిగే అవకాశం!
Surya Nakshatra Transit

Updated on: Aug 24, 2026 | 5:16 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ రాజు రవి ఆత్మవిశ్వాసం, నాయకత్వం, గౌరవం, పదవి, ప్రతిష్ఠకు కారకుడిగా భావిస్తారు. రవి నక్షత్రాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర నమ్మకం. ముఖ్యంగా శుక్రుడి అధిపత్యంలోని పుబ్బ నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను అందించే అవకాశముంది. రవి ఆగస్టు 31న మఘ నక్షత్రం నుంచి పుబ్బ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 13 వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. పుబ్బ నక్షత్రానికి శుక్రుడు అధిపతి. ఈ నక్షత్రం ప్రేమ, భౌతిక సుఖాలు, సంపద, కళలు, సంగీతం, సృజనాత్మకతకు సంబంధించినదిగా భావిస్తారు. దీంతో ఈ కాలంలో కొందరికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రయోజనాలు కలగవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

మేష రాశి

మేష రాశి వారికి సూర్యుడి నక్షత్ర మార్పు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతితో పాటు ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరిగే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే పరిస్థితులు ఏర్పడతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ నక్షత్ర మార్పు విజయానికి కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశముంది. అకస్మాత్తుగా పెద్ద విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతితో పాటు సమాజంలో పేరు, ప్రతిష్ఠ పెరగవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

తుల రాశి

తుల రాశి వారికి సూర్యుడి పూర్వఫల్గుణి నక్షత్ర ప్రవేశం పలు విషయాల్లో సానుకూల ఫలితాలను పొందే అవకాశముంది. వ్యాపారులకు పెద్ద డీల్ లభించే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశముంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం లభించడంతో కీలకమైన పనులను సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ నక్షత్ర మార్పు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభించే ఛాన్స్ ఉంది. అయితే ప్రయాణాలు, వినోదం, సుఖసౌకర్యాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖరీదైన వస్తువును కొనుగోలు చేయాలనే కోరిక కూడా నెరవేరవచ్చు.

(గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు జ్యోతిష్య విశ్వాసాలు, సంప్రదాయ అంచనాల ఆధారంగా మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు)

Loading...
Unable to load recommendations.
Follow Us