Sun Transit 2026: మరో వారంలో వీరికి జాక్‌పాట్..! కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు

సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 17 వరకు కొనసాగే ఈ సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి, కొత్త అవకాశాలు, ఆదాయంలో మెరుగుదల వంటి శుభ ఫలితాలు కలగవచ్చని భావిస్తున్నారు.

Sun Transit 2026: మరో వారంలో వీరికి జాక్‌పాట్..! కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు
Sun Transit 2026

Updated on: Sep 11, 2026 | 6:21 PM

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడి(రవి)ని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. ఆత్మవిశ్వాసం, గౌరవం, కీర్తి, అధికారం, పదవికి సూర్యుడు కారకుడిగా భావిస్తారు. అందుకే సూర్యుడి ప్రతి రాశి పరివర్తనకు జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. 2026 సెప్టెంబర్ 17న సూర్యుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 17 వరకు సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. ఈ సంచారం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా వృషభం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు.

వృషభ రాశి

సూర్యుడి కన్యా రాశి సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి సంబంధించిన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు కొత్త పరిచయాలు, అవకాశాలకు ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రయోజనం కలగే అవకాశముంది.

కన్యా రాశి

సూర్యుడు స్వయంగా కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలు కలిగే అవకాశముందని భావిస్తారు. ఉద్యోగంలో పదవి, బాధ్యత, గుర్తింపు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు ముందుకు సాగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం కెరీర్, ఆర్థిక రంగాల్లో పురోగతికి దోహదపడే అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చేస్తున్న పనులకు గుర్తింపు దక్కుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చని భావిస్తారు.

మకర రాశి

మకర రాశి వారికి ఈ సూర్య సంచారం సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి, కొత్త బాధ్యతలు లభించవచ్చు. వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో లాభం దక్కుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది.

ఈ రాశులు జాగ్రత్త..

సూర్యుడి కన్యా రాశి సంచారం అందరికీ ఒకే విధమైన ఫలితాలను ఇవ్వదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కర్కాటకం, తుల, కుంభం, మీన రాశుల వారు ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది. ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలను నివారించడం మంచిదని చెబుతున్నారు.

(గమనిక: పై ఫలితాలు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడినవి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు)

Loading...
Unable to load recommendations.
Follow Us