
జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. రాహువు రాశి గోచారం, నక్షత్ర మార్పులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాహువు ధనిష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీని ప్రభావం 2027 ఏప్రిల్ 10 వరకు కొనసాగుతుంది. ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి కుజుడు. సంపద, అభివృద్ధి, విజయాలకు ధనిష్ఠ నక్షత్రాన్ని ప్రతీకగా భావిస్తారు. కుజుడు శక్తి, ధైర్యం, పట్టుదలకు కారకుడిగా పరిగణించబడటంతో.. ఈ నక్షత్రంలో రాహువు సంచారం కొన్ని రాశులకు కొత్త అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు, కెరీర్‌లో పురోగతిని అందించే అవకాశం ఉంది.
ధనిష్ఠ నక్షత్రంలో రాహువు సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధించడంతో పాటు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు దక్కే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా కూడా ఈ కాలం ప్రయోజనకరంగా ఉండవచ్చు. మార్కెట్‌లో చిక్కుకున్న డబ్బు లేదా ఇతరులకు ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కోర్టు లేదా వివాదాలకు సంబంధించిన సమస్యల్లోనూ పరిష్కార మార్గం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
కన్య రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం కొత్త అవకాశాలను తీసుకొచ్చే అవకాశముంది. సన్నిహిత వ్యక్తి సహకారంతో కొత్త పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను అందించే ఛాన్స్ ఉంది. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతుంది. ఇంట్లో కొంతకాలంగా ఉన్న సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, కష్టపడి పనిచేసే స్వభావంతో క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ సామర్థ్యానికి ప్రశంసలు పొందుతారు.
కుంభ రాశి వారికి కూడా ఈ కాలం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించడంతో సంబంధాల్లో సాన్నిహిత్యం పెరిగే అవకాశముంది. ఉద్యోగులకు తమ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశముంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదవి లేదా బాధ్యత పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగే ఛాన్స్ ఉంది. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది.
(గమనిక: ఈ ఫలితాలు జ్యోతిష్య శాస్త్రంలోని సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయి.)