Telugu News Astrology Mars Transit 2026: Kuja Dosha Alert for These 6 Zodiac Signs, Family Problems Likely
కుజ దోషంతో కుటుంబ జీవితంలో సమస్యలు.. ఈ రాశుల వారు జాగ్రత్త!
Kuja Dosha: కుజుడి సింహ రాశి సంచారంతో ఆరు రాశుల వారికి కుజ దోష ప్రభావం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబం, వైవాహిక జీవితంలో సమస్యలు, మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. మరి ఈ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుజ దోష నివారణకు జ్యోతిష్య శాస్త్రం సూచిస్తున్న పరిహారాలేమిటి?
ప్రస్తుతం సింహ రాశిలో ప్రవేశించిన కుజుడు అదే రాశిలో మరో నాలుగున్నర నెలలు సంచారం చేసే అవకాశం ఉంది. కుజుడి సింహ రాశి ప్రవేశంతో కొన్ని రాశుల వారికి కుజ దోషం (మాంగల్య దోషం) ప్రారంభం అవుతుంది. కుజ దోషం వల్ల కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు ఎక్కువగా కలుగుతాయి. కుజుడు వ్యక్తిగత రాశికి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం కలుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశులవారు తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు పగడం పొదిగిన ఉంగరం ధరించడం మంచిది.
వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి కుజ దోషం కలిగింది. దీనివల్ల కుటుంబంలో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో తరచూ వాగ్వాదాలు తలెత్తే అవకాశం ఉంది. మనశ్శాంతి బాగా తగ్గుతుంది. కుటుంబంలో టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు లోపిస్తాయి. ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. పిల్లల్ని తరచూ అనారోగ్యాలు బాధించే అవకాశం కూడా ఉంది. ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తుతాయి.
కర్కాటకం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. జీవిత భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతోనూ ఈ రాశివారు తొందరపాటుతో వ్యవహరించడం, వాదించడం, అతిగా అధి కారం చెలాయించడం వంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడు తుంది. కొద్దిగా వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మాట తొందర తగ్గించుకోవడం మంచిది.
సింహం: ఈ రాశిలో కుజుడి సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. దీనివల్ల ఈ రాశివారిలో అహంకారం, ఆధిపత్య ధోరణి పెరిగే అవకాశం ఉంది. దూకుడుగా వ్యవహరించడం జరుగుతుంది. దీనివల్ల జీవిత భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కుటుం బంలో ఎవరో ఒకరు తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి ఖర్చు లుంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.
కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల మాంగల్య దోషం కలిగింది. దీనివల్ల జీవిత భాగ స్వామి తరచూ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతో షాలు లోపిస్తాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి. వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆందోళనకర వార్తలు వినాల్సి వస్తుంది. పిల్లల వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
మకరం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజుడి సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. దీనివల్ల జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో దూర ప్రాంతానికి బదిలీ కావడం వల్ల ఎడబాటు కలుగుతుంది. ఆర్థికంగా మోసపోవడం, నష్టపోవడం, ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో టెన్షన్లు పెరిగే సూచనలున్నాయి. సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి. జీవిత భాగస్వామితో అల్ప విషయాల మీద అపార్థాలు, విభేదాలు తలెత్తుతాయి.
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడి, దాంపత్య జీవితంలో సమ స్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో వివిధ కారణాల వల్ల ఎడబాటు కలిగే అవకాశం ఉంది. దంపతుల్లో ఒకరికి బదిలీ కావడం, అనారోగ్యానికి గురి కావడం, తరచూ పర్యటనలు చేయవలసి రావడం, అనుమానాలు కలగడం వంటివి జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల వల్ల మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది.