
వృషభం: ఈ రాశికి చతుర్థ, సప్తమాధిపతులైన రవి, కుజుల మధ్య పరివర్తన జరగడం వల్ల అధికార యోగం ఏర్పడింది. ఈ రెండు గ్రహాల పరివర్తన వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతి కలిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఆస్తి వివాదంలో ఆశించిన విజయం లభిస్తుంది.

కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు, ధన స్థానాధిపతి రవికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందడంతో పాటు. ధన ధాన్యాలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తగ్గడంతో పాటు ముఖ్యమైన ఆర్థిక అవస రాలు కూడా తీరిపోతాయి. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి వృద్ధి చెందు తాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి.

సింహం: రాశ్యధిపతి రవికి, చతుర్థాధిపతి కుజుడికి మధ్య పరిపర్తన జరగడం వల్ల ఆస్తి లాభం కలుగు తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. లాభదాయక పరిచయాలు, ఒప్పందాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, నిరు ద్యోగులకు విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గృహ లాభం కలుగుతుంది.

తుల: ఈ రాశికి ధన, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. జీతభత్యాలు కూడా బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విపరీతంగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదే శాలకు వెళ్లడం జరుగుతుంది. ఉన్నతస్థాయి జీవితం, జీవనం ఏర్పడతాయి. ప్రభుత్వ మూలక ధన లాభానికి, ప్రభుత్వ గుర్తింపునకు అవకాశం ఉంది. అనారోగ్యానికి తగ్గ చికిత్స లభిస్తుంది.

వృశ్చికం: ఈ రాశ్యధిపతి కుజుడికి, దశమాధిపతి రవికి పరివర్తన జరగడం వల్ల విదేశాల్లో ఉద్యోగం లభించ డానికి బాగా అవకాశం ఉంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. పిత్రార్జితం లభించే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఉద్యో గంలో జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కుంభం: ఈ రాశికి సప్తమ, దశమాధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగపరంగా రాజ యోగం పడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. స్థాన చలనంతో కూడిన పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు విస్తరించడం జరుగు తుంది. ఆదాయంలో అంచనాలకు మించిన పెరుగుదల ఉంటుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడం, ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. ఉన్నత పదవులు లభిస్తాయి.