Telugu News Astrology Mars Moon Sign Exchange: These 6 Zodiac Signs May See Success in Their Efforts on September 27 29
పరివర్తన యోగంతో వీరికి పట్టిందల్లా బంగారమే..! కొన్ని సమస్యల నుంచి విముక్తి
Parivartan Yoga: సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో కుజుడు–చంద్రుడి రాశి పరివర్తన ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ మూడు రోజుల్లో పట్టుదలతో చేసే ప్రయత్నాలు, తీసుకునే కీలక నిర్ణయాలు సమీప భవిష్యత్తులో సానుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలు కూడా కనిపించవచ్చు.
సాహసానికి, ధైర్యానికి, తెగువకు, చొరవకు, ప్రయత్నాలకు కారకుడైన కుజుడు ఈ నెల(సెప్టెంబర్) 27, 28, 29 తేదీల్లో చంద్రుడితో రాశి పరివర్తన చెందడం జరుగుతోంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో కుజుడు, కుజుడికి చెందిన మేష రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన చోటు చేసుకుంది. ఈ పరివర్తన వల్ల కొన్ని రాశుల వారు పట్టుదలగా ప్రతిదీ సాధించుకుంటారు. కొన్ని కీలక సమస్యల నుంచి బయటపడతారు. ఈ మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు సమీప భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. కొద్ది ప్రయత్నంతో మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి దీని వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మేషం: రాశ్యధిపతి కుజుడికి, చతుర్థాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరిగినందువల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి తప్పకుండా విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశా లకు వెళ్లడం కూడా జరుగుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి సంపద గానీ, ఆస్తి గానీ కలిసి వస్తుంది. ప్రతిభా పాటవాలు, సమర్థత వెలుగులోకి వస్తాయి. స్వయం కృషితో అభివృద్ధి చెందుతారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మిథునం: ధనాధిపతి చంద్రుడికి, లాభాధిపతి కుజుడికి మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఈ రాశివారి కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక తప్పకుండా నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది.
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడితో దశమాధిపతి కుజుడికి పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది బాటపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజ యాలు సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. మంచి పరిచ యాలు కలుగుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
తుల: సప్తమాధిపతి కుజుడితో దశమాధిపతి చంద్రుడు పరివర్తన చెందడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు మెరుగుపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. లాభదాయక స్నేహాలు పెంపొందుతాయి. అనారోగ్య సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందు తాయి. ఆస్తులు కలిసివస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
మకరం: ఈ రాశికి సప్తమ, చతుర్థాపతులైన కుజ, చంద్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీయాన యోగం, విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడతాయి. నిరుద్యో గులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ, దాంపత్య బాగా అనుకూలంగా మారుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో రాబడి, ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి మార్గాలు విస్తరిస్తాయి.
మీనం: ఈ రాశికి ధన, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.