Telugu News Astrology Jupiter, Mercury and Mars Bring Powerful Positive Energy: These Zodiac Signs Could See Major Success Until June 20
గురువు సహా 3 గ్రహాల కటాక్షం.. ఇక ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
గురు, బుధ, కుజ గ్రహాల అనుకూల సంచారం కారణంగా జూన్ 20 వరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ముఖ్యంగా గురువు ఉచ్ఛ స్థితిలో ఉండటం, బుధుడు-కుజుడు స్వరాశుల్లో సంచరించడం వల్ల ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత జీవితంలో శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మీన రాశుల వారు ఈ కాలంలో విజయాలు, పురోగతి మరియు శుభ యోగాలను అనుభవించే అవకాశం ఉంది.
ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం గురు, బుధ, కుజ గ్రహాలు బాగా అనుకూల సంచారం చేస్తున్నాయి. జూన్ 2 నుంచి గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తుండగా, బుధ, కుజులు తమకు స్వస్థానాలైన మిథున, మేష రాశుల్లో జూన్ 20 వరకు సంచారం చేస్తున్నాయి. జూన్ 20 వరకు ఈ మూడు శుభ గ్రహాలు బాగా బలంగా ఉండడమనేది కొన్ని రాశులకు బాగా లాభించబోతున్నాయి. ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వీరు తమ జీవితాల్లో అనేక విజయాలు సాధిస్తారు. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మీన రాశులకు శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వస్తాయి.
మేషం: రాశ్యధిపతి కుజుడితో పాటు, బుధ, గురువులు ఈ రాశికి బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఇక నుంచి ఆర్థిక, ఉద్యోగ సంబంధమైన అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. అధికారులు, యజమానుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
మిథునం: ఈ రాశిలో రాశ్యధిపతి బుధుడు, లాభ స్థానంలో లాభాధిపతి కుజుడు, ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలి తాలని స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు కుజ, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఏ ఆదాయ వృద్ది ప్రయత్న మైనా తప్పకుండా సఫలమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు విశేషంగా లాభిస్తాయి. ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
కన్య: ఈ రాశికి గురు, బుధుల అనుకూలత బాగా పెరిగినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఆశించిన ఉన్నత పదవులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.
తుల: ఈ రాశికి కుజ, బుధ, గురువుల వల్ల రుచక, మహా భాగ్య, హంస మహాపురుష యోగాలు పట్టినందువల్ల రాజపూజ్యాలు, రాజ యోగాలు, ధన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు అనేక మార్గాలో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు జీతభత్యాలు పెరగడం, రాబడి అంచనాల్ని మించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి.
మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం, ధన స్థానంలో ధనాధిపతి కుజుడు, చతుర్థ స్థానంలో చతుర్ధాధిపతి బుధుడు సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. మదుపులు, పెట్టుబడుల వల్ల లాభాలు అంచనాల్ని మించుతాయి.