
మేషం: పుత్ర కారకుడైన గురువు ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే కుటుంబ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి పిల్లల వల్ల సుఖసంతోషాలు కలిగే అవకాశం ఉంది. పిల్లలు చదు వుల్లో బాగా రాణిస్తారు. కొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. చదువుల్లో రికార్డు స్థాయి ఘన విజయాలు సాధిస్తారు. మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారితోనే పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.

మిథునం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురు సంచారంతో వల్ల ఈ రాశికి చెందినవారి పిల్లలు చదువులు, నైపుణ్యాలు, పోటీ పరీక్షల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. పిల్లల పురోగతి విషయంలో ఈ రాశివారు నిశ్చింతగా ఉండవచ్చు. చదువుల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. అదనపు నైపుణ్యాలు, శిక్షణల్లో కూడా బాగా రాణించే అవకాశం ఉంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పిల్లల విజయాలు, సాఫల్యాల విషయంలో ఏదో ఒక శుభవార్త వింటూనే ఉంటారు.

కర్కాటకం: పుత్ర కారకుడు, పుత్ర స్థానాధిపతి అయిన గురు గ్రహం ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తు న్నందువల్ల ఈ రాశివారి పిల్లలు ఏ రంగంలో ఉన్నా బాగా రాణించడం, గుర్తింపు పొందడం జరు గుతుంది. చదువుల్లో రికార్డులు సృష్టిస్తారు. పిల్లల్లో క్రమశిక్షణ, చదువుల పట్ల శ్రద్ధ బాగా పెరుగు తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు, మంచి ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారు తమ పిల్లలకు సంబంధించి ఎక్కు వగా శుభవార్తలు వినడం జరుగుతుంది. తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. సంతాన పరంగా అనేక అదృష్టాలు కలుగుతాయి. పిల్లల మీద ఈ రాశివారు పెట్టుకున్న ఆశలు చాలా వరకు నెరవేరుతాయి. పిల్లలు చదువుల్లోనే కాక వృత్తి, ఉద్యోగాల్లో కూడా బాగా పురోగతి చెందుతారు. పిల్లలు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి.

వృశ్చికం: గురువు భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశివారికి పిల్లల విషయంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విజయాలు, సాఫల్యాలతో వారు పురోగమించడం, గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లోనే కాక, ఉద్యోగాల్లో సైతం రాణించడం, ఆఫర్లు, ఆహ్వానాలు అందడం వంటివి జరుగుతాయి. విదే శాల్లో ఉద్యోగం సంపాదించడం, స్థిరపడడం జరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం: రాశ్యధిపతి గురువు పిల్లల విషయాలకు సంబంధించిన పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల పిల్లలు ఏ రంగంలో ఉన్నా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. పిల్లల సమస్యలన్నీ తొలగి పోతాయి. సంతానం కలగడానికి బాగా అవకాశం ఉంది. చదువుల్లో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వీరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల పురోగతి విషయంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు.