Horoscope: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఇందులో ఉందా? సోమవారం రాశిఫలాలు..

నేటి గ్రహ గతులు, నక్షత్ర సంచారాలు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? మీ రాశి ప్రకారం నేడు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఎదురుకానున్నాయి? మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల సమగ్ర ఫలితాలు మీకోసం..

Horoscope: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఇందులో ఉందా? సోమవారం రాశిఫలాలు..
Horoscope Today October 19

Edited By:

Updated on: Oct 19, 2026 | 6:48 AM

ఇవాళ మేషం, మిథునం, వృశ్చిక రాశుల వారికి గ్రహబలం అనుకూలంగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, చేపట్టిన పనుల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత గుర్తింపుతో పాటు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కన్య, ధనుస్సు రాశుల వారికి ఆస్తి వివాదాలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. అయితే వృషభం, కర్కాటకం, మకర రాశుల వారికి పనిభారం, ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున ఆర్థిక లావాదేవీల్లో, ముఖ్యమైన నిర్ణయాల్లో కాస్త ఆచితూచి అడుగు వేయడం మంచిది. మొత్తం మీద నేటి ద్వాదశ రాశుల సమగ్ర ఫలితాలు వివరంగా ఇలా ఉన్నాయి…

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభ సాటిగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమ స్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి ఇబ్బంది ఉంటుంది.  కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందుతుంది. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావా దేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.  ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మంచి పరి చయాలు కలుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి కష్టనష్టాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. అదనపు ఆదాయ మార్గాల ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగు తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన వ్యవ హారాల్లో శ్రమ, తిప్పట ఉండవచ్చు. గతంలో మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. ఇష్టమైన ఆల యాలను సందర్శిస్తారు. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యక్తిగత సమ స్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు పూర్తవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభ వార్త వింటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం  పెరుగుతుంది. అధికారులు కీలక విషయాలను మీతో చర్చిస్తారు. మిత్రుల తోడ్పాటుతో వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి  ఆశించిన లాభాలు పొందుతారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించిన రాబడి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలంగా చక్కబడతాయి. పెండింగ్ పనుల్ని పట్టు దలగా  పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.  సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. మీ శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు తిరుగుండదు. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరు గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.  వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఊరట కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గు తుంది.  మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు దొర్లే  అవ కాశం కూడా ఉంది. కొందరు బంధువుల వల్ల చికాకులు తలెత్తుతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ధనపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం పెట్టుకోవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. కొద్ది శ్రమతో పనులన్నిటినీ చక్కబెడతారు. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవ హారాలు, పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ప్రతి ఫలం లభిస్తుంది.  వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ పరిస్థి తులు అనుకూలంగా ఉంటాయి.  ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అదనపు ఆదాయ మార్గాలు కొద్దిగా విస్తరించే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతల్ని సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఒకరిద్దరు మిత్రులకు బాగా సహాయం చేస్తారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us