Horoscope Today
దిన ఫలాలు (డిసెంబర్ 18, 2023): మేష రాశి నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసి, లాభాలు అందుకుంటారు.. వృషభ రాశివారు ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మిథునం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి.. అయితే, మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసి, లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఏవైనా వివాదాలుంటే అవి పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి తండ్రి వైపు వారి నుంచి శుభవార్త అందే సూచనలున్నాయి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను సునాయా సంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ప్రతి విషయం లోనూ కొద్దిగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యో గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళతాయి. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో విందులో పాల్గొంటారు. స్థాన చలనానికి, స్థలం మార్పుకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. సహోద్యోగులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనేక మార్గాల నుంచి ఆదాయం అందు తుంది. ఇష్టమైన బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు. సంతాన యోగా నికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : అనుకోకుండా ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులకు అండగా నిలబడతారు. వృత్తి, వ్యాపారాల్లో సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా శ్రద్ధ తీసు కోవాలి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పరవా లేదు.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. శుభ కార్యాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. స్థిరాస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువుల విషయంలో కాస్తంత అప్రమ త్తంగా వ్యవహరించడం మంచిది. మోసపోయే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కుటుంబ సమస్యను సతీమణితో కలిసి పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఒకరిద్దరు మిత్రులకు అండగా నిలబడతారు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. బంధు మిత్రుల నుంచి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో వాహ నాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిసోతాయి. వ్యాపారాలలో విపరీతంగా ఒత్తిడి, శ్రమ కనిపిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఒకటి రెండు శుభవార్తలతో ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరి ష్కారం కావచ్చు. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. రాదనుకుని వదిలేసు కున్న డబ్బు చేతికి అందుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగా లలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాలలో చాలావరకు సానుకూలంగా ఉంటాయి. అధికారులు గౌరవమర్యాదలతో వ్యవ హరిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. స్నేహితులతో మంచి కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి ఆదరణ పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే సూచనలున్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు ఎంతగానో ఉపకరి స్తాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంత సంస్థల నుంచి ఆఫర్లు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. కొత్తగా వ్యాపారాలు చేపట్టే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలేమైనా ఉంటే సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణాల వల్ల కొద్దిగా నష్టపోయే అవ కాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికి రాదు.