Horoscope Today: వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Sep 13, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 13, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయి ప్రోత్సాహకాలు అందుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 13th September 2024
Follow us on

దిన ఫలాలు (సెప్టెంబర్ 13, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయి ప్రోత్సాహకాలు అందుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో మీ మాట బాగా చెల్లుబాటవు తుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి అంచనాలను మించుతుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఆస్తి వివాదం ఆశించిన విధంగా పరిష్కారమవుతుంది. ఆదాయప రంగా కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి సంబంధమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో ఆశించిన స్థాయి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కీలక విషయాల్లో స్నేహితులు అండగా నిలబడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతికి అవకాశం ఉంది. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు సామగ్రి కొను గోలు చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రోజంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగం నుంచి బయటపడే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. అధికారులకు మీ ప్రతిభా పాటవాలు, సమర్థత బాగా ఉప యోగపడతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దల తోడ్పాటుతో కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక ఒత్తిళ్లు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆదాయ ప్రయత్నాలు ఉపయోగకరంగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తి అవు తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలగకపోవచ్చు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ముఖ్య మైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. కొందరు బంధువుల కారణంగా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబం జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆశిం చిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొన్ని ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. ఉద్యోగంలో అనుకూల వాతావ రణం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి జీవితం చాలావరకు సాఫీగా సాగిపో తుంది. వ్యాపారాల్లో డిమాండ్ పెరిగి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. వ్యక్తిగత సమస్యల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి శ్రమ, సమస్యలున్నప్పటికీ, లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యో గంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేపడతారు. కొత్త ఉద్యోగం విషయంలో ఆశించిన సమా చారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతారు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో మరింతగా సమర్థతను నిరూపించుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇష్టమైన బంధుమిత్రులతో సర దాగా ఎంజాయ్ చేస్తారు. రాదనుకున్న డబ్బు, బాకీలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సానుకూలంగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపో తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం అవ సరం. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడికి గురవుతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఎవరికీ హామీలు ఉండ వద్దు.