Horoscope Today: వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Sep 02, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 2, 2024): మేష రాశి వారు ఈ రోజు కొత్త ప్రయత్నం ఏది చేపట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారికి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 02nd September 2024
Follow us on

దిన ఫలాలు (సెప్టెంబర్ 2, 2024): మేష రాశి వారు ఈ రోజు కొత్త ప్రయత్నం ఏది చేపట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారికి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొత్త ప్రయత్నం ఏది చేపట్టినా విజయవంతం అవుతుంది. బంధువుల నుంచి ఊహించని శుభ వార్తలు వినడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభా లపరంగా జోరందుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనులన్నీ చురుకుగా పూర్తవుతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని ఖర్చుల విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు చదువుల్లో ఆశించిన పురో గతి సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తాయి. వృత్తి, ఉద్యో గాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రం దర్శిస్తారు. బంధువులతో కొద్దిగా విభేదాలు తలెత్తుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆశించిన విధంగా ఆదాయం పెరుగుతుంది. శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆస్తి విషయంలో సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడ తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ముందుకు దూసుకుపోతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వివాదాన్ని రాజీమార్గం ద్వారా పరిష్కరిం చుకుంటారు. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితంలో కాస్తంత ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేయ డం జరుగుతుంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొందరు ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాలు బాగా కలిసి వస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదరుతుంది. ఆర్థిక లావాదేవీలు, లాభి స్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఇంటా బయటా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు పొందు తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు బాగా ఉత్సాహంగా సాగి పోతాయి. వృత్తి జీవితం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీ ప్రతిభ బాగా రాణిస్తుంది. నిరు ద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇంటా బయటా శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేపట్టినా వ్యయ ప్రయాసలు తప్పక పోవచ్చు. ప్రయాణాల్లో ఇబ్బందులున్నా బాగా లాభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కొందరు మిత్రులు ఆర్థిక సహాయం కోరే అవ కాశం ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఆశాభంగం చెందే అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సునాయాసంగా లాభాలు అందుకుంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. అనుకున్న పనులు చాలావరకు సకాలంలో పూర్తవు తాయి. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, కుటుంబ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత సమస్యకు ఊహించని పరిష్కారం లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

స్థిరాస్తి వ్యవహారాలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. లాభదాయక పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయటా విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు వెడతాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి ఉన్నా అధికారుల ఆదరణ పొందుతారు. ఆధ్యాత్మిక విష యాల మీద దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను చాటుకుం టారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకారం అందజేస్తారు. చేపట్టిన పనుల్ని వేగంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ సభ్యుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యో గంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి