
వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కొన్ని చిన్నా చితకా సమస్యల్ని అధిగ మిస్తారు. వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఫలితముంటుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. బంధు వుల నుంచి శుభ కార్యాల ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపో తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక బాధ్యతల మార్పు తప్పకపోవచ్చు. కొత్త లక్ష్యాల మీద పని చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. విదేశాల్లో ఉన్న బంధువులతో పెళ్లి నిశ్చయం అవుతుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు.
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజ యాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశముంది. ఉద్యోగ జీవితంలో అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. బాధ్యతల్లో మార్పులు చోటు చేసు కుంటాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం జరుగుతుంది. రావ లసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. తలపెట్టిన పనులన్నిటినీ వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అను కూలంగా ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటుండదు.
ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగుతాయి. కుటుంబ సమేతంగా ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహకారం లభి స్తుంది. ప్రధాన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగు తాయి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. నిరుద్యో గులకు ఆఫర్లు అందుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. ఆర్థిక సహాయం విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల వల్ల నష్టాలకు గురవుతారు. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్త వుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్య మైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు.
ఉద్యోగంలో పదోన్నతికి, జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత పనులు మీద శ్రద్ద అవసరం. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. సరికొత్త ఆలోచనలతో వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.