దిన ఫలాలు (డిసెంబర్ 1, 2023): మేష రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది.మిథున రాశికి చెందిన వారు ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ముఖ్యమైన పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అయ్యే అవకాశం ఉంది. రోజంతా మనశ్శాంతిగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి అనుకోకుండా శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబపరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆదాయానికి లోటు ఉండదు. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నెమ్మదిగా పూర్తవు తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తిపరంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావ రణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు ఎదు రయ్యే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. సంతా నం విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల సహాయ సహకారాలతో ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ జీవితంలో మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలను అధికారులు పాటించి ప్రయోజనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. కొత్త ఆలోచ నలు, కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్తంత ఉప శమనం లభిస్తుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవ హారాలలో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయిగానే ఉంటారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆర్థిక ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. సమయం అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. రోజంతా బిజీగా సాగిపోతుంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట ): వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయా లకు అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. కుటుంబ వ్యవహారా లలో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. కొత్త ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కొత్త ఉద్యోగానికి ఆఫర్లు అందుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగు తుంది. ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొం టారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవు తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన సొమ్ము అనుకోకుండా చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముఖ్యమైన లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యం నిర్వహించడానికి అవ కాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ప్రయాణాల్లోనూ, ఆహార విహా రాల్లోనూ వీలైనంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవసరా నికి ధన సహాయం అందుతుంది. రుణ భారం తగ్గించుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆర్థిక ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఇష్టమైన బంధువులతో కాలక్షేపం చేస్తారు.