Zodiac Signs: ఈ 5 రాశుల వారికి కోపం అధికం.. వీరు ఎవరి జోలికి వెళ్ళరు.. తమతో గొడవపడితే వదలరు..

|

Feb 17, 2022 | 1:47 PM

Zodiac Signs: కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల స్వభావం చాలా కోపం ఉంటుంది. అలాంటి వ్యక్తులు తమను తాము చాలా ఉన్నతంగా భావిస్తారు. అంతేకాదు తాము చేసినపని కరెక్ట్ అని నిరూపించుకోవడానికి..

Zodiac Signs: ఈ 5 రాశుల వారికి కోపం అధికం.. వీరు ఎవరి జోలికి వెళ్ళరు.. తమతో గొడవపడితే వదలరు..
Horoscope Today
Follow us on

Zodiac Signs: కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల స్వభావం చాలా కోపం ఉంటుంది. అలాంటి వ్యక్తులు తమను తాము చాలా ఉన్నతంగా భావిస్తారు. అంతేకాదు తాము చేసినపని కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి రాశులకు చెందిన వ్యక్తులతో గొడవ పడకపోవడమే మంచిది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి..

మేష రాశి: ఈ రాశి అంగారక గ్రహానికి చెందింది. కుజుడు అధిపతి. ఈ కుజుడు గ్రహాలకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. అంతేకాదు కుజుడు చాలా కోపం స్వభావం కలవాడు. కనుక ఇతని స్వభావం ఈ రాశి వ్యక్తులపై చూపుతుంది.  ఈ రాశివారితో వివాదాలు ఏర్పడితే.. కోపంతో ఏమైనా చేయగల నేచర్ కలిగి ఉంటారు. ఎవరైనా ఈ రాశివారితో శత్రుత్వం కలిగి ఉంటే.. అతనికి గుణపాఠం చెప్పిన తర్వాత మాత్రమే వీరు శాంతిస్తారు.

సింహ రాశి: ఈ రాశి సూర్యుని రాశి. సూర్యుడు గ్రహాలకు రాజు కావడంతో  ఈ రాశివారికి సూర్యుడి గుణం ప్రభావం చూపిస్తుంది. ఈ రాశివారు కాంతివంతంగా ఉంటారు. అంతేకాదు చాలా కోపం కలిగి ఉంటారు. సాధారణంగా అందరితో బాగానే ప్రవర్తిస్తారు .. అయితే వీరికి ఎవరిపైన అయినా  చిరాకు  కలిగితే కోపం అదుపులో ఉండదు. ఈ వ్యక్తులు ఎవరినీ తమ ముందు నడవనివ్వరు. తమని ఎవరైనా తప్పుగా నిరూపించడానికి ప్రయత్నిస్తే.. వారిపై ఆధిపత్యం చెలాయిస్తారు. కనుక ఈ రాశివారితో గొడవ పడకపోవడమే మంచిది.

వృశ్చిక రాశి : ఈ రాశి కూడా అంగారకుడిదే.  ఈ రాశి చిహ్నం తేలు. ఈ రాశివారికి చాలా కోపం ఉంటుంది. అయితే కోపాన్ని సులభంగా వ్యక్తం చేయరు. కానీ ఎవరైనా తమని ఎక్కువగా ఇబ్బంది పెట్టినప్పుడు.. తమ నిగ్రహాన్ని కోల్పోయి.. అవతలి వారిని ఇబ్బంది పెట్టడానికి వెనుకాడరు. ఈ రాశివారికి ఎవరిపైన అయినా  అసూయకలిగితే అది చాలా  ప్రమాదకరం.

మకర రాశి: ఈ రాశి శనీశ్వరుడుది. శని దేవుడిని కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు అంటారు. సాధారణంగా, ఈ వ్యక్తులు జీవితంలో ఏ పనినైనా ఆలోచనాత్మకంగా చేస్తారు. ఎవరినీ బాధపెట్టాలని అనుకోరు. అయితే ఎవరైనా తమని మోసం చేస్తే ఆ విషయాన్ని మర్చిపోరు.  ఏలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుటి వ్యక్తికి పాఠం చెప్పిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటారు.

కుంభ రాశి : ఈ రాశి కూడా శని రాశి. ఈ రాశి వారు ఎవరైనా తప్పు చేయడం చూసినప్పుడు మాత్రమే చిరాకు పడతారు. వీరు ఎవరికీ చెడు చేయరు. చెడుని సహించరు లేదా చెడు జరుగుతుంటే చూడలేరు. తప్పును ప్రతిఘటించడం వీరి స్వభావం. వారు తమ జీవితంలోని అన్ని విషయాలను తమలో దాచుకుంటారు. కనుక వీరు తమ వ్యక్తిగత జీవితంలో ఎవరి జోక్యాన్ని ఇష్టపడరు. ఎవరైనా తమ జీవితంలోకి తొంగి చూస్తే .. అతని స్థానాన్ని అతనికి సులభంగా చూపిస్తారు.

Also Read:

తిరుమల శ్రీవారి తరహాలో కాణిపాకం వినాయకుడికి స్వర్ణ రథం.. ఈరోజు ప్రారంభం

 మేడారం మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం.. గద్దె వద్దకు సారలమ్మ ఆగమనం…