దసరాతో దశ తిరిగిపోతుందంతే..! ఆ రాశుల వారి జీవితాల్లో ఇక అన్ని శుభాలే..

| Edited By: Janardhan Veluru

Sep 28, 2024 | 6:50 PM

అక్టోబర్ 3వ తేదీ నుంచి 12 వరకు చోటు చోసుకోబోయే నవ రాత్రుల్లో (దసరా పర్వదినాల్లో) బుధ, చంద్రులు రాశులు మారడంతో పాటు, 11 నుంచి గురువు వక్రగతి పట్టడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారం ఫలితంగా దసరా సమయంలో కొన్ని రాశులకు యోగ ప్రదంగా సాగిపోతుంది. ఏ పని చేపట్టినా విజయవంతం కావడం, కుటుంబంలో శుభకార్యాలు జరగడం, కుటుంబ పరిస్థితులు మెరుగుపడడం..

దసరాతో దశ తిరిగిపోతుందంతే..! ఆ రాశుల వారి జీవితాల్లో ఇక అన్ని శుభాలే..
Dasara Horoscope
Follow us on

అక్టోబర్ 3వ తేదీ నుంచి 12 వరకు చోటు చోసుకోబోయే నవ రాత్రుల్లో (దసరా పర్వదినాల్లో) బుధ, చంద్రులు రాశులు మారడంతో పాటు, 11 నుంచి గురువు వక్రగతి పట్టడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారం ఫలితంగా దసరా సమయంలో కొన్ని రాశులకు యోగ ప్రదంగా సాగిపోతుంది. ఏ పని చేపట్టినా విజయవంతం కావడం, కుటుంబంలో శుభకార్యాలు జరగడం, కుటుంబ పరిస్థితులు మెరుగుపడడం, ఉద్యోగాలు లభించడం, పెళ్లి సంబంధాలు కుదరడం, శుభవార్తలు ఎక్కువగా వినడం వంటివి జరుగుతాయి. ఈ గ్రహాల రాశుల మార్పు వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశుల వారికి జీవితంలో శుభ పరిణామాలు, సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు, గురు, బుధ, రాహువులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల ఈ నవరాత్రుల కాలంలో ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఇదే రాశిలో గురువు వక్రించడం కూడా జరగబోతున్నందువల్ల అప్రయత్న ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఈ 9 రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయమూ, ప్రతి ప్రయత్నమూ తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమర్థతను నిరూపించుకుంటారు. అనేక శుభవార్తలు వింటారు.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడు ముందుగా రవితోనూ, ఆ తర్వాత శుక్రుడితోనూ కలవడం వల్ల ఈ రాశికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి, ప్రముఖుల నుంచి గుర్తింపు, ధన లాభం కలిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో హోదా పెరగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది.
  3. కన్య: ఈ రాశివారికి ధన, భాగ్య స్థానాలు బలపడుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవు తుంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. ఆదాయానికి సంబంధించి ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా మారిపోయి, ఆర్థి కంగా అందలాలు ఎక్కుతారు. పూర్తి స్థాయిలో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మాటకు విలువ పెరుగు తుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలున్నాయి.
  4. తుల: ఈ రాశికి చంద్ర, బుధులు అనుకూలంగా మారడంతో పాటు గురువు వక్రించడం కూడా ఊహిం చని లాభాలను, శుభాలను కలిగిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా ఫలిస్తుంది. ఆకస్మిక ధన లాభా నికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభి స్తాయి. ఉద్యోగ జీవితం మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. మకరం: ఈ రాశికి కలలో కూడా ఊహించని అదృష్టం పడే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలోనే కాక, కుటుంబ జీవితంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలన్నీ వింటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఆరో గ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశివారికి గురు, బుధులతో పాటు శుక్ర, చంద్రులు కూడా పూర్తి స్థాయిలో బలపడుతు న్నం దువల్ల వీరికి దసరాల నుంచి జీవితం చాలా కాలంపాటు నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగి పోయే అవకాశం ఉంది. అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదా యానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.