Telugu News Astrology Astrology in telugu 3 key planets transit in Simha rashi these zodiac signs must be careful with money issues details in telugu
Astrology: సింహ రాశిలో మూడు గ్రహాల కలయిక.. వారం రోజుల పాటు ఈ రాశుల వారు కాస్త జాగ్రత్త..!
ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు మూడు ముఖ్యమైన గ్రహాలు - రవి, శుక్ర, బుధులు- సింహ రాశిలో కలిసి ఉండబోతున్నాయి. ఈ రాశిలో మూడు గ్రహాల కలియిక వల్ల కొన్ని రాశులకు శుభ యోగాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం మిశ్రమ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరగడం, నష్టదాయక వ్యవహారాలు చేపట్టడం..
ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు మూడు ముఖ్యమైన గ్రహాలు – రవి, శుక్ర, బుధులు- సింహ రాశిలో కలిసి ఉండబోతున్నాయి. ఈ రాశిలో మూడు గ్రహాల కలియిక వల్ల కొన్ని రాశులకు శుభ యోగాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం మిశ్రమ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరగడం, నష్టదాయక వ్యవహారాలు చేపట్టడం, వృథా ప్రయత్నాలు వంటివి ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా కొద్దిపాటి సమస్యలకు అవకాశం ఉంది. ఓ వారం రోజుల పాటు ఈ రాశుల వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది.
మిథునం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో శుక్ర, రవులు కలుస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మిత్రుల ప్రోద్బలంతో నష్టదాయక వ్యవహారాలను చేపట్టే సూచనలు కూడా ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి మళ్లీ మొదటికొస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.
కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో సహా మూడు గ్రహాలు కలవడం వల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్న చందంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. రావలసిన డబ్బు ఎక్కువగానే ఉన్నా డబ్బు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది.
వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ, శుక్ర, రవుల సంచారం వల్ల ఉద్యోగంలో ఆదరణతో పాటు పని భారం కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పడితే గానీ ఫలితం కనిపించదు. ఇరుగు పొరుగుతో మాటలు పడాల్సి వస్తుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబంలో చిన్నా చితకా సమస్యలుంటాయి. నిరుద్యోగులు సాధారణ ఉద్యోగాలతో సరిపెట్టుకో వాల్సి వస్తుంది. ఏ పనీ అనుకున్నది అనుకున్నట్టు జరగదు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.
మకరం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో ఈ మూడు ముఖ్యమైన గ్రహాలు యుతి చెందుతున్నందువల్ల శ్రమ మీది, ఫలితం మరొకరిది అన్నట్టుగా ఉంటుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవు తుంది. ఉద్యోగంలో మీకు దక్కాల్సిన క్రెడిట్ మరొకరికి దక్కుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధి క్యత వల్ల విశ్రాంతి దూరమవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగం తప్పకపోవచ్చు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది.
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో మూడు గ్రహాలు చేరడం కెరీర్ పరంగా పరవాలేదు కానీ, కుటుంబ జీవితానికి, దాంపత్య జీవితానికి మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. ఊహించని సమస్యలు తలెత్తు తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో నిరాశకు గురి కావడం జరుగుతుంది. వ్యాపారాల్లో భాగస్థులతో సమస్యలు తలెత్తు తాయి. మిత్రుల ప్రలోభాలకు లొంగిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి.
మీనం: ఈ రాశికి షష్ట స్థానంలో శుక్ర, బుధ, రవుల యుతి జరుగుతున్నందువల్ల కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో అపార్థాలు చోటుచేసుకుంటాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిగా నష్టాలు తప్పకపోవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో కొద్దిగా మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. మిత్రులతో అకా రణ వైరం ఏర్పడుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ వ్యయ ప్రయాసలతో పూర్తయ్యే అవకాశం ఉంది.