Telugu News Astrology Astrology 2025: Love, Marriage Prospects Rise for 6 Signs in Karthika Masam
Marriage Astrology: గురు, శుక్రుల అనుకూలత.. కార్తీక మాసంలో వీరికి పెళ్లిళ్లు ఖాయం!
ప్రస్తుతం గురువు ఉచ్ఛ స్థితిలో ఉండటం, నవంబర్ 3 నుండి శుక్రుడు తులలోకి ప్రవేశించడంతో కార్తీక మాసంలో ప్రేమ, పెళ్లి, దాంపత్య జీవితాల్లో అద్భుతమైన అనుకూలతలు ఏర్పడతాయి. ఈ శుభ గ్రహాల కలయిక మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రత్యేకించి శుభప్రదం. ఏ చిన్న ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది, దాంపత్య సుఖ సంతోషాలు పెరుగుతాయి.
ప్రస్తుతం గురువు ఉచ్ఛపట్టి ఉండడం, నవంబర్ 3 నుంచి శుక్రుడు కూడా తన స్వస్థానమైన తులా రాశిలో ప్రవేశించడం వల్ల ప్రేమలు, పెళ్లిళ్లు, దాంపత్య జీవితం వంటి విషయాల్లో అనుకూలతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాలు శుభ గ్రహాలైనందు వల్ల, గురువు శుభ కార్యాలకు, శుక్రుడు ప్రేమలు, పెళ్లిళ్లకు కారకులైనందువల్ల కొన్ని రాశులకు కార్తీక మాసమంతా శుభప్రదంగా జరిగిపోయే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారు ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా ఈ విషయాల్లో సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. దాంపత్య జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో గురువు సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడం గానీ, ప్రేమలో పడడం గానీ తప్పకుండా జరుగుతుంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి కలిసి రావడం, సిరిసంపదలు పెరగడం వంటివి జరుగుతాయి. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది.
మిథునం: ఈ రాశికి కుటుంబ స్థానంలో ఉచ్ఛ గురువు, పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. దాంపత్య సమస్యలు పూర్తిగా పరిష్కారమై అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది.
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం, చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాల స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కుటుంబంలో ఎక్కువగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లి, గృహ ప్రవేశం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి ఖాయం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయం సాధిస్తారు. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
కన్య: కుటుంబ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశివారికి తప్ప కుండా కుటుంబం ఏర్పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఇష్ట మైన వ్యక్తితో లేదా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. గృహ ప్రవేశం చేసే యోగం కూడా కలుగుతుంది. భోగభాగ్యాలు వృద్ధి చెందుతాయి. జీవనశైలిలో మార్పు వస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ధనుస్సు: రాశినాథుడు గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛపట్టడం, శుక్రుడు లాభ స్థానంలో సంచారం ప్రారం భించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. శుభ కార్యాలకు కారకుడైన గురువు అష్టమ స్థానంలో, అంటే మాంగల్య స్థానంలో ప్రవేశించడం వల్ల ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి.
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ గురువు, దశమ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల కుటుంబంలో కొన్ని ముఖ్యమైన శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలతో పాటు గృహ, వాహన ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ప్రేమ ప్రయత్నాలు సఫలమవుతాయి. సహోద్యోగితో కానీ, ప్రేమించిన వ్యక్తితోగానీ పెళ్లయ్యే అవకాశం ఉంది. అనేక విధాలుగా సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి.