మిస్టర్ ఇమ్రాన్.. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి

పుల్వామా ఉగ్ర ఘటనలో తమదేశం పాత్రేమీ లేదన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఖండించారు. ‘‘పుల్వామా ఉగ్రఘటనలో ఏం జరిగిందో మా నిఘా సంస్థలు కావాల్సినన్ని ఆధారాలు అందించాయి’’ అని రావత్ తెలిపారు. అయితే భారత సైనిక దళాల అణచివేత కారణంగానే ఓ కశ్మీరీ బాలుడు ప్రభావితం అయ్యాడని.. అతడే పుల్వామా ఘటనకు పాల్పడ్డాడని.. దానికి పాకిస్తాన్‌ను వెలుగులోకి తీసుకొచ్చారని ఇమ్రాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. జైషే ఉగ్రసంస్థ పాక్‌కు […]

మిస్టర్ ఇమ్రాన్.. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 8:33 AM

పుల్వామా ఉగ్ర ఘటనలో తమదేశం పాత్రేమీ లేదన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఖండించారు. ‘‘పుల్వామా ఉగ్రఘటనలో ఏం జరిగిందో మా నిఘా సంస్థలు కావాల్సినన్ని ఆధారాలు అందించాయి’’ అని రావత్ తెలిపారు.

అయితే భారత సైనిక దళాల అణచివేత కారణంగానే ఓ కశ్మీరీ బాలుడు ప్రభావితం అయ్యాడని.. అతడే పుల్వామా ఘటనకు పాల్పడ్డాడని.. దానికి పాకిస్తాన్‌ను వెలుగులోకి తీసుకొచ్చారని ఇమ్రాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. జైషే ఉగ్రసంస్థ పాక్‌కు చెందిందే అయినప్పటికీ.. దాని కార్యకలాపాలు కశ్మీర్‌లో కూడా కొనసాగుతున్నాయని.. ఆ దాడి స్వదేశానికి సంబంధించిందేనని ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి చేశారు. ఈ దాడిలో 40మంది జవాన్లు మరణించారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ జైషే సంస్థ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.