AP SEC Nimmagadda Letter : ఉద్యోగులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ… మీకు ఎవరూ సాటిలేరంటూ ప్రశంసలు

కరోనా కేసులు పూర్తిగా తగ్గలేదని.. ఎన్నికల నిర్వహణలో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెప్తుండడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వారిపై ఫోకస్‌ పెట్టారు.

AP SEC Nimmagadda Letter : ఉద్యోగులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ... మీకు ఎవరూ సాటిలేరంటూ ప్రశంసలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 10, 2021 | 8:25 PM

AP SEC Nimmagadda Letter : కరోనా కేసులు పూర్తిగా తగ్గలేదని.. ఎన్నికల నిర్వహణలో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెప్తుండడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వారిపై ఫోకస్‌ పెట్టారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఉద్యోగులకు లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్‌ షీల్డ్‌, శానిటైజర్ ఇవ్వాలని సూచించామని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో పోలింగ్‌ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరామన్నారు. పోలింగ్‌లో పాల్గొనే సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారాయన.

సీఎస్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే స్పష్టం చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి అని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరంటూ ఆకాశానికి ఎత్తేశారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధిగా గుర్తుచేశారాయన. ఆ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి.. ఫేస్‌ షీల్డ్‌లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తామన్నారు. నిర్ణీత సమయంలో ఎన్నికలు పూర్తిచేస్తే ఆర్థిక సంఘం నిధులొస్తాయని.. ఇందుకు అందరూ సహకరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి :

Temperature Dipped : విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మ‌హోత్స‌వం.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు.. ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల్లో కొత్త ఆందోళన