చిన్నారి కళ్లకు క్యాన్సర్..చలించిపోయిన జగన్..

సీఎం జగన్ తన మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడతోన్న చిన్నారి హేమ కష్టాలు సీఎం మనసును కదిలించాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం వెంటనే పాపకు వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని కడియం మండలం కడియపులంకకు చెందిన భీమిని దుర్గాప్రసాద్‌ కుమార్తె హేమ చిన్నవయసులోనే కంటి క్యాన్సర్ భారిన పడింది.  దీంతో ఆర్థిక స్తోమత సరిపోకపోయినా, అప్పులు చేసి  హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు తల్లిదండ్రులు. కానీ పరిస్థితి శృతి […]

చిన్నారి కళ్లకు క్యాన్సర్..చలించిపోయిన జగన్..
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 03, 2019 | 7:13 PM

సీఎం జగన్ తన మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడతోన్న చిన్నారి హేమ కష్టాలు సీఎం మనసును కదిలించాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం వెంటనే పాపకు వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని కడియం మండలం కడియపులంకకు చెందిన భీమిని దుర్గాప్రసాద్‌ కుమార్తె హేమ చిన్నవయసులోనే కంటి క్యాన్సర్ భారిన పడింది.  దీంతో ఆర్థిక స్తోమత సరిపోకపోయినా, అప్పులు చేసి  హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు తల్లిదండ్రులు.

కానీ పరిస్థితి శృతి మించడంతో..క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని డాక్టర్లు పాప కళ్లను తొలగించారు. అయినప్పటికి హేమకు నిత్యం వైద్య పరీక్షల కోసం, మందుల కోసం డబ్బును సమకూర్చుకోడానికి కుటుంబం తీవ్ర యాతనలు పడుతోంది. ఈ విషయాన్ని వార్తా ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సీఎం వెంటనే రెస్పాండ్ అయ్యారు.  పాప కుటుంబ సభ్యులతో వెంటనే మాట్లాడి, వైద్యం చేయించాలని, ఎంత ఖర్చైనా వెనకాడొద్దని జగన్ సూచించారు.

క్యాన్సర్ విషయంలో ‘ఆరోగ్యశ్రీ’ పరిధులు లేవు: సీఎం

నిరుపేదలకు వైద్యం అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. క్యాన్సర్‌ బాధితులు ‘ఆరోగ్యశ్రీ’ కింద ఎన్ని సార్లైనా ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇందుకు ఎటువంటి పరిధులు, పరిమితులు ఉండవని సీఎం జగన్ స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి ఈ రూల్ అమలులోకి రాబోతుందని, ఈ లోపు అత్యవసర కేసులు ఏమైనా ఉంటే చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.