ఎస్‌ఈసీనీ వైసీపీ మరో రాజకీయపార్టీగా భావిస్తుంది… బడ్జెట్‌పై విజయసాయిరెడ్డివి పచ్చి అబద్దాలన్న సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, వైసీపీ ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి..

ఎస్‌ఈసీనీ వైసీపీ మరో రాజకీయపార్టీగా భావిస్తుంది... బడ్జెట్‌పై విజయసాయిరెడ్డివి పచ్చి అబద్దాలన్న సోము వీర్రాజు
Follow us

|

Updated on: Feb 02, 2021 | 6:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, వైసీపీ ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ కు, అధికార వైసీపీ నేతలకు మధ్య ఒక విధమైన ఘర్షణ వాతావరణం నెలకొంది.

అయితే ఎన్నికల సంఘం విషయంలో వైసీపీ తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ ను వైసీపీ నేతలు మరో రాజకీయ పార్టీగా భావిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులను బెదిరించేందుకు తప్పుడు కేసులను బనాయిస్తున్నారని మండిపడ్డారు.

బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడటం అయన అవగాహనరాహిత్యానికి నిదర్శనం అన్నారు సోము వీర్రాజు. విజయసాయికి అబద్ధాలు చెప్పడం అలవాటేనన్నారు సోము వీర్రాజు.

రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు గాను రూ. 28 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకుని, భవనాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని సోము వీర్రాజు విమర్శించారు.

అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేయమని ఆయనే ఆదేశించారు.. ఎన్నికలంటే వైసీపీకి భయం లేదన్న ధర్మాన కృష్ణదాస్‌