MLA Vallabaneni Vamsi: చంద్రబాబుపై ఓ రేంజ్‌లో పంచ్‌లు పేల్చిన MLA వల్లభనేని వంశీ.!

ఏపీలో హైవోల్టేజ్‌ పాలిటిక్స్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్నటి వరకు దీక్షలు, ధర్నాలు, నిరసనలు.! ఇప్పుడు మ్యాటర్ ట్విట్టర్‌కు చేరింది.

MLA Vallabaneni Vamsi: చంద్రబాబుపై ఓ రేంజ్‌లో పంచ్‌లు పేల్చిన MLA వల్లభనేని వంశీ.!
Vallabhaneni Vamsi

Updated on: Oct 24, 2021 | 2:45 PM

Vallabhaneni Vamsi: ఏపీలో హైవోల్టేజ్‌ పాలిటిక్స్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్నటి వరకు దీక్షలు, ధర్నాలు, నిరసనలు.! ఇప్పుడు మ్యాటర్ ట్విట్టర్‌కు చేరింది.ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై ఓ రేంజ్‌లో పంచ్‌లు పేల్చారు MLA వల్లభనేని వంశీ.!

చంద్రబాబు నిజమే. నేను విశ్వాసఘాతుకుడినే. అది నీ ఒక్కడికి మాత్రమే.. కానీ నువ్వు..ఇందిరాగాంధీ, NTR, హరికృష్ణ, మోడీ, అమిత్‌షా లాంటి పెద్దలకు నమ్మకద్రోహివి..వెన్నుపోటుదారుడివి అంటూ విమర్శించారు.  అంతేకాదు..కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన పార్టీలకు కూడా నమ్మకద్రోహివి అంటూ ట్వీట్ చేశారు.

వెన్నుపోట్లు..నమ్మకద్రోహాలకు, విశ్వాసఘాతుకాలకు నిఖార్సైన పేటంట్‌ నీదే అంటూ ఆరోపించారు వల్లభనేని వంశీ. ఇంకా, నేను కేసీఆర్‌ గారికి పొర్లు దండాలు పెడితే.. మరి నువ్వు చేస్తున్నదేంటి చంద్రబాబు అంటూ ట్వీట్టర్లో ప్రశ్నించారు వంశీ.

Read also:  Amit Shah J&K Visit: జమ్ముకశ్మీర్‌ అభివృద్ధే లక్ష్యం.. ఐఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన హోం మంత్రి అమిత్‌షా