CM Jagan : ప్రజలందరి చల్లని దీవెనలతోనే ముందుకు.. రెండేళ్ల సంక్షేమ పాలనపై బుక్‌ విడుదల చేసిన సీఎం వైయస్‌ జగన్‌

|

May 31, 2021 | 12:36 AM

ఒక డాక్యుమెంట్లో ఒక్కో కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు, మరో డాక్యుమెంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశాం.. అమలుకు చర్యలు తీసుకుంటున్న వాటిపై వివరణ..

CM Jagan : ప్రజలందరి చల్లని దీవెనలతోనే ముందుకు..  రెండేళ్ల సంక్షేమ పాలనపై బుక్‌ విడుదల చేసిన సీఎం వైయస్‌ జగన్‌
Ys Jagan
Follow us on

AP CM YS Jagan on Two Years Ruling : ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చల్లని దీవెనలతోనే రెండు సంవత్సరాల ప్రభుత్వ పాలన పూర్తి చేసుకోగలిగామని ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గడచిన రెండు సంవత్సరాల్లో 94.5 శాతం హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పూర్తిచేశామని గర్వంగా తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. 66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మలకే చెందుతున్నాయన్న జగన్.. . ప్రతి పథకం అక్కచెల్లెమ్మకు వెళ్లడం, ఆ డీటైల్స్‌ ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా ప్రతి ఆశను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేసేందుకు శక్తిని ఇవ్వాలని దేవుడ్ని కోరుతున్నానని జగన్‌ అన్నారు. ఇవాళ అమరావతిలో రెండేళ్ల సంక్షేమ పాలనపై రూపొందించిన డాక్కుమెంట్లను జగన్ ఆవిష్కరించారు. ఒక డాక్యుమెంట్లో ఒక్కో కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు, మరో డాక్యుమెంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశాం.. అమలుకు చర్యలు తీసుకుంటున్న వాటిపై వివరణ ఇస్తూ ఉంటుంది. ఈ రెండు డాక్యుమెంట్లను వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకూ పంపిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.

Read also : Helplines : నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ప్రజలకు తెలియ పర్చాలని టీవీ ఛానళ్లకు వినతి