Mysterious Disease : పశ్చిమ గోదావరి జిల్లా కామిరెపల్లి లో వెలుగులోకి వచ్చిన వింత వ్యాధి .. మూర్ఛ రోగంతో ఒకరు మృతి

|

Jan 24, 2021 | 12:42 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్ళీ అంతుచిక్కని వింత వ్యాధి కలకలం సృష్టిస్తుంది. ఈ వింత వ్యాధి లక్షణాలతో తాజాగా దెందులూరు మండలం కొమిరేపల్లిలో..

Mysterious Disease : పశ్చిమ గోదావరి జిల్లా కామిరెపల్లి లో వెలుగులోకి వచ్చిన వింత వ్యాధి .. మూర్ఛ రోగంతో ఒకరు మృతి
Follow us on

Mysterious Disease : పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్ళీ అంతుచిక్కని వింత వ్యాధి కలకలం సృష్టిస్తుంది. ఈ వింత వ్యాధి లక్షణాలతో తాజాగా దెందులూరు మండలం కొమిరేపల్లిలో ఒకరు మరణించారు. పశువుల మేతకోసేందుకు పొలానికి వెళ్లిన రైతు ఏసుపాదం.. మూర్ఛరోగంతో కాల్వలో పడి మృతి చెందాడు. రైతు మృతి చెందిన విషయాన్ని గమనించిన ఆ మార్గంలో పొలానికి వెళ్తున్న ఓ వ్యక్తి గ్రామస్థులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులు కౌలు రైతు మృతి చెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.

ఈ అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో కొమిరేపల్లిలో గురువారం రాత్రి తొలి కేసు నమోదవగా, శుక్రవారం కొత్తగా 24 మంది వ్యాధి బారినపడ్డారు. వీరిలో పురుషులు 16, మహిళలు 9 మంది ఉన్నారు. వీరిలో 21 మంది కోలుకోగా నలుగురు చికిత్స పొందుతున్నారు. బాధితులందరిలోనే ఒకే లక్షణాలు కనిపిస్తున్నాయని కళ్లు తిరగటం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలపడటం, నోటి నుంచి నురగ రావడం వంటి లక్షణాలు కనిపించాయని.. ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు చెప్పారు.

ఏలూరులో డిసెంబర్‌ 4న మొదలైన ఈ అంతుచిక్కని వ్యాధి కలవరం దాదాపు రెండు వారాలపాటు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ తరహా లక్షణాలతో అస్వస్థతకు గురి కావడం ఇటీవల తరచుగా జరుగుతోంది.

Also Read: ఆర్టీసీ బస్ డ్రైవర్ ట్రైనింగ్ క్లాస్ లకు హాజరైన మహిళ.. అవకాశం ఇస్తే స్టీరింగ్‌ పడతా..