Woman Driver In APSRTC: ఆర్టీసీ బస్ డ్రైవర్ ట్రైనింగ్ క్లాస్ లకు హాజరైన మహిళ.. అవకాశం ఇస్తే స్టీరింగ్‌ పడతా..

మహిళలు అన్నింటా మగవారితో సమానమే.. వారికంటే తాము ఏమీ తక్కువ కాము అంటూ అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ తమదైన శైలిలో చరిత్ర...

Woman Driver In APSRTC: ఆర్టీసీ బస్ డ్రైవర్ ట్రైనింగ్ క్లాస్ లకు హాజరైన మహిళ.. అవకాశం ఇస్తే  స్టీరింగ్‌ పడతా..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 12:09 PM

Woman Driver In APSRTC మహిళలు అన్నింటా మగవారితో సమానమే.. వారికంటే తాము ఏమీ తక్కువ కాము అంటూ అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ తమదైన శైలిలో చరిత్ర సృష్టిస్తున్నారు నేటి మహిళ. అంతరిక్షంలో, కధనం రంగంలో ఇలా అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్న మహిళ తాజాగా భారీ వాహనాలను కూడా నడిపేందుకు సై అంటున్నారు. ద్విచక్రవాహనాలు.. ఆటోలు.. కార్లు మాత్రమే కాదు.. భారీ వాహనాలు నడిపేందుకు కూడా ఆడవారు సిద్ధపడుతున్నారు. వివరాల్లోకెళితే..

ఏపీ ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం నుంచి భారీ వాహనాలు నడపడంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కడప ఆర్టీసీ డిపో మేనేజర్‌ కార్యాలయ ఆవరణలోని డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ శిక్షణ తరగతులకు కడప నగరానికి చెందిన వై.మాలశ్రీ అనే యువతి హాజరయ్యారు. మాలాశ్రీకి ఇదివరకే లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు ఉంది. దీంతో తాజగా భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందేందుకు వచ్చారు. శిక్షణలో భాగంగా శనివారం కడప రోడ్లపై బస్సు నడిపారు.

ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నె, ముంబయి వంటి నగరాల్లో మహిళలు బస్సు డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా కడప నగరంలో మాలశ్రీ దరఖాస్తు చేసుకుని శిక్షణకు రావడం విశేషం. శిక్షణ పూర్తి చేసుని హెవీ లైసెన్స్‌ పొందిన తర్వాత ఆర్టీసీలో డ్రైవర్‌ ఉద్యోగం చేసే అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానన్నారు మాలాశ్రీ. తన భర్త ప్రోత్సాహంతోనే డ్రైవర్ గా ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాని చెప్పారు. బస్సు నడిపేందుకు ధైర్యంగా ముందుకు వచ్చిన యువతిని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభినందించారు. ఆమెను చూసి మరికొందరు మహిళలు డ్రైవర్లుగా ఉద్యోగం చేయడానికి ముందుకొస్తారని అభిప్రాయపడుతున్నారు.

Also Read: పెళ్లి తర్వాత కూతురు మారిపోయిందంటున్న నాగబాబు.. తనకు కాబోయే కోడలు ఎలావుండాలో చెప్పారుగా