మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

| Edited By:

Mar 12, 2020 | 8:43 AM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో.. పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ నేత.. మహిళా సీఐపై చేయిచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో..

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో.. పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ నేత.. మహిళా సీఐపై చేయిచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఏకంగా.. సీఐపై అందులోనూ.. మహిళా అధికారిపై చేయి చేసుకోవడంతో.. వన్ టౌన్ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందని దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. నామినేషన్ల సందర్భంగా.. శ్రీకాకుళం వన్‌ టౌన్ సీఐ లలితపై.. సరు బుజ్జిలి మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సమ్మ చేయి చేసుకున్నారట. క్యూలో రమ్మన్నందుకు సీఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో.. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని.. స్థానికంగా ఉన్న ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా.. ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అక్కడక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటునే ఉంటున్నాయి. తాజాగా.. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలైన బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కార్లపై.. వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. డీసీపీ గౌతం సవాంగ్ సైతం దాడి ఘటనపై స్పందించారు.

Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్