ఓ మహిళకు తన సొంత పొలంలోనే అరుదైన వజ్రం లభించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామానికి చెందిన మహిళకు తన పొలంలోనే వజ్రం లభించింది. ఇది దాదాపు ఆరు క్యారెట్ల బరువుందని సమాచారం. వజ్రం లభించిన అదే రోజు అర్థరాత్రి అనంతపురం జిల్లా.. గుత్తికి చెందిన బంగారు వ్యాపారులకు దాన్ని అమ్మేసింది. దీంతో.. ఈ వజ్రానికి వ్యాపారులు ఆమెకు రూ.4 లక్షల రూపాయలు, మూడు తులాల బంగారం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో సారి కర్నూలు జిల్లాలో కూలీలకు వజ్రాలు దొరికాయి. మొదటి వజ్రం రూ.13 లక్షలకు అమ్ముడుపోగా.. దాని తర్వాత ఇదే ఖరీదైందని స్థానికులు చెబుతున్నారు.