AP Weather: ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు.. ఇదిగో వాతావరణ హెచ్చరిక

|

Jun 29, 2024 | 9:42 PM

ఏపీలకి రెయిన్ అలర్ట్ వచ్చింది వాతావరణ శాఖ. అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని.. పలు ప్రాంతాల్లో ఓ మోస్టారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

AP Weather: ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు.. ఇదిగో వాతావరణ హెచ్చరిక
Andhra Weather Report
Follow us on

ఋతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు జైసల్మేర్, చురు, భివానీ, ఢిల్లీ, అలీఘర్, హర్దోయ్, మొరాదాబాద్, ఉనా, పఠాన్‌కోట్, జమ్మూ గుండా వెళుతుంది. ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు ఉత్తర ఒడిశా-గంగా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీద ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనము సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంటుంది. గాలి కోత /షియర్ జోన్ సుమారుగా ఉత్తర అక్షమం 20 వెంట ఇప్పుడు 5.8 నుండి 7.6 కి.మీ. ల మద్య కనిపిస్తుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

ఆదివారం:-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది

సోమవారం :-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

శనివారం:- :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఆదివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-

—————-

శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..