Rain Alert: వర్షాలే.. వర్షాలు.. మూడు రోజుల వెదర్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ ప్రాంతాల్లో కుండపోత..

| Edited By: Rajitha Chanti

Jul 21, 2024 | 5:00 PM

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది.. ఈరోజు, జూలై 21, 2024 అంతర్గత ఒడిశా, పరిసర ప్రాంతాలపై గల అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ 0830 గంటలకు ఒడిశా, ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉంది.

Rain Alert: వర్షాలే.. వర్షాలు.. మూడు రోజుల వెదర్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ ప్రాంతాల్లో కుండపోత..
AP Rain Alert
Follow us on

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది.. ఈరోజు, జూలై 21, 2024 అంతర్గత ఒడిశా, పరిసర ప్రాంతాలపై గల అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ 0830 గంటలకు ఒడిశా, ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉంది. రానున్న 12 గంటల్లో ఇది ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టం వద్ద జైసల్మేర్, కోట, గుణ, మాండ్లా, ఒడిశా అంతర్భాగం & ప్రక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్, చంద్‌బాలీ, తూర్పు-ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ప్రాంతము మధ్య వెళుతుంది. సముద్ర మట్టం నుండి 3.1 & 5.8 కిమీ ఎత్తులో షీర్ జోన్ సుమారుగా 20°ఉత్తర అక్షాంశము వద్ద, ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఆదివారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

సోమవారం – మంగళవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

ఆదివారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

సోమవారం – మంగళవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

రాయలసీమ :-

ఆదివారం, సోమవారం, మంగళవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..