ఏపీ ఎక్స్ క్లూజివ్ లేడీ ప్రొటెక్షన్ యాప్.. దిశ యాప్.. ఇటీవల రమ్య ఉదంతం తర్వాత దిశ యాప్ ఆవశ్యకత మరింత పెరిగిందని భావించిన పోలీసులు.. ఈ యాప్ పై మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికి ఫ్రీ బస్ జర్నీ ఆఫరిస్తూ.. దిశ యాప్ డౌన్ లోడ్ స్పీడ్ పెంచే యత్నం చేశారు.
దిశయాప్ వాడకంపై అవగాహన పెంచేందుకు తానే స్వయంగా తన కొడుకుతో కలసి బస్సు ఎక్కి.. ఆడపిల్లల్లో మరింత ఉత్సాహం నింపారు. అంతే కాదు వారితో మాటా మంతీ కలిపి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ కోసం ఐడియాలను అడిగి తెలుసుకున్నారు. మహిళ్ల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కల్పిస్తూ.. వాటికి నివారణోపాయాలను వివరించారు. సోషల్ మీడియాకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలని సూచించారు ఎస్పీ దీపికా పాటిల్.
ఇటీవల జిల్లాకు వచ్చిన ఎస్పీ దీపికా పాటిల్.. మహిళా భద్రతను సీరియస్ గా తీసుకున్నట్టు చెప్పారు. దిశ యాప్ వాడకంపై విస్తృత ప్రచారం చేస్తున్నామని అన్నారు. గత ఇరవై రోజుల్లో మూడు లక్షల ముప్పై వేల మంది మహిళల మొబైల్స్ లో దిశ యాప్ డౌన్ లోడ్ చేయించి ఆపదలో ఉన్నప్పుడు ఎస్వోఎస్ కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం ఎలా.. అన్న అంశంపై అవగాహన కల్పించారు.
దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న మహిళలు, విద్యార్ధినులు తమ మొబైల్ చూపితే చాలు.. ఉచిత బస్సు ప్రయాణం చేసేలా అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా దీపికా పాటిల్ పోలీసుల ఉచిత బస్సు లో ప్రయాణించారు. ఎస్పీ దీపికా పాటిల్ చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
జిల్లా మహిళా లోకం ఎస్పీ దీపికపై ప్రశంసలతో ముంచెత్తారు. జిల్లాలో ప్రతి మహిళ మొబైల్లో దిశ యాప్ ఉండటమే తన లక్ష్యమంటున్నారు ఎస్పీ దీపిక. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అనిల్ తో పాటు పలువురు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: తాలిబన్లకు ఆ ప్రదేశం అంటే వణుకు.. కనీసం కన్నువేయడానికి కూడా వణికిపోతుంటారు.. ఎందుకో తెలుసా..
నల్లబంగారం ఎలా తయారు చేస్తారు.. గుర్తిపు పత్రం నుండి మార్కెట్ వరకు ప్రతిదీ తెలుసుకోండి..