వైఎస్ వివేకా కేసు.. మరోసారి పులివెందులకు సీబీఐ

| Edited By:

Sep 12, 2020 | 5:44 PM

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పులివెందులలో మరోసారి సీబీఐ విచారణను ప్రారంభించనుంది

వైఎస్ వివేకా కేసు.. మరోసారి పులివెందులకు సీబీఐ
Follow us on

YS Viveka Murder Case: మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పులివెందులలో మరోసారి సీబీఐ విచారణను ప్రారంభించనుంది. ఈ కేసును దర్యాప్తుకు తీసుకున్న సీబీఐ బృందాలు.. జూలైలో మొదటిసారి విచారణ ప్రారంభించాయి. రెండు వారాల పాటు ముమ్మరంగా దర్యాప్తు చేసి సాక్ష్యులు, అనుమానితులను అధికారులు విచారించారు. ఇక ఇప్పుడు నలభై రోజుల తరువాత మళ్లీ అక్కడ విచారణను ప్రారంభించనున్నారు అధికారులు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల ఆర్‌&బి గెస్ట్‌హౌజ్‌కి చేరుకున్నారు. అయితే గతేడాది మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికలు దగ్గరగా ఉన్న సమయంలో ఆయన హత్యకు గురవ్వగా.. ఈ ఘటన రాజకీయంగానూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Read more:

తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

అన్ని ప్రార్థనా మందిరాల వద్ద కెమెరాలను అమర్చండి: ఏపీ డీజీపీ