అన్ని ప్రార్థనా మందిరాల వద్ద కెమెరాలను అమర్చండి: ఏపీ డీజీపీ

ఆంధ్రప్రదేశ్‌లో మతాలకు సంబంధించి కుట్రపూరితమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.

అన్ని ప్రార్థనా మందిరాల వద్ద కెమెరాలను అమర్చండి: ఏపీ డీజీపీ
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2020 | 4:48 PM

Gautam Sawang Antarvedi issue: ఆంధ్రప్రదేశ్‌లో మతాలకు సంబంధించి కుట్రపూరితమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన తెలిపారు. అంతర్వేది ఘటనపై మాట్లాడిన గౌతమ్.. అన్ని మతాల ప్రార్థనా మందిరాల వద్ద భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పరిసర ప్రాంతాలు కూడా స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఉద్దేశ్యపూర్వకంగానే కొంతమంది ఆకతాయిలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనివలన శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గౌతమ్ సవాంగ్‌ హెచ్చరించారు. అన్ని ప్రార్థనా స్థలాల వద్ద అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని ఎస్పీలకు ఆయన సూచించారు. జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామని గౌతమ్ సవాంగ్ వివరించారు.

Read More:

డ్రగ్స్‌ కేసు.. నాకు ఏం బాధ లేదు బ్రదర్‌: నవదీప్‌

నాణ్యమైన విద్యుత్ పొందడం రైతు హక్కు: డొక్కా