వరంగల్‌ 9 హత్యల కేసులో నేడు తుది తీర్పు.. నిందితుడికి ఉరి శిక్ష..!

| Edited By:

Oct 28, 2020 | 9:07 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ 9 హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరి శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్‌ 9 హత్యల కేసులో నేడు తుది తీర్పు.. నిందితుడికి ఉరి శిక్ష..!
Follow us on

Warangal well bodies case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ 9 హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరి శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ ఏడాది మే 21న వరంగల్‌ శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్‌ కంపెనీలో 9 మందిని మత్తు ఇచ్చిన నిందితుడు వారిని సజీవంగా బావిలో పడేసి హత్యకు పాల్పడ్డారు. మొదట నాలుగు మృతదేహాలు బయటపడగా.. మరుసటి రోజు మరో ఐదు మృతదేమాలు కనిపించాయి. ఈ కేసును విచారించిన పోలీసులు నాలుగు రోజుల్లో బీహార్‌కి చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ని నిందితుడిగా తేల్చారు. అతడిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నెల రోజుల్లోనే కోర్ట్‌లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇవాళ న్యాయమూర్తి తుది తీర్పును వెల్లడించనున్నారు.(ఐక్యరాజ్యసమితిలో కరోనా కలకలం.. 5 దేశాల ప్రతినిధులకు పాజిటివ్‌)

మృతుల వివరాలు

1.మసూద్ ఆలం
2. నిషా ఆలం, మసూద్‌ భార్య
3.భూస్రా ఆలం, మసూద్‌ కుమార్తె
4. 3సంవత్సరాల బాబు(భూస్రా కుమారుడు)
5.శబాబ్ ఆలం, మసూద్‌ కుమారుడు
6. సోహిల్ ఆలం, మసూద్ మరో కుమారుడు
7.షకీల్, డ్రైవర్
8. శ్రీ రాం, తోటి కార్మికుడు
9. శ్యామ్, తోటి కార్మికుడు.

(Bigg Boss 4: ఆ విషయంపై రేపు మాట్లాడదామన్న అభి.. ఓకే చెప్పిన అఖిల్‌)