గ్రామానికి ఒకే వినాయక విగ్రహం

| Edited By:

Aug 11, 2020 | 1:09 PM

కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో పండుగలపై కూడా ఆ ప్రభావం పడింది. మార్చి మొదలు ఇప్పటివరకు జరిగిన పండుగలను

గ్రామానికి ఒకే వినాయక విగ్రహం
Follow us on

One Ganesh for One Village: కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో పండుగలపై కూడా ఆ ప్రభావం పడింది. మార్చి మొదలు ఇప్పటివరకు జరిగిన పండుగలను ఇళ్లలోనే ఉండి చేసుకున్నారు ప్రజలు. ఇక ఈ నెలలో రాబోతున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశాయి. విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండకూడదని, నిమజ్జనాలకు సైతం ఎక్కువగా రాకూడదని ఆంక్షలు పెట్టారు. ఈ క్రమంలో మాట్లాడిన నల్గొండ డీసీపీ నారాయణ రెడ్డి.. కరోనా పరిస్థితుల దృష్ట్యా గ్రామానికి ఒకే వినాయక విగ్రహం పెట్టాలని సూచించారు. అది కూడా మూడు అడుగుల ఎత్తుకు మించకుండా ఉండాలని తెలిపారు. అలాగే ఉత్సవాల సయంలో జనం గుమికూడకుండా ఉండాలని, ఉత్సవ నిర్వాహకులు బలవంతంగా చందాలు వసూలు చేయొద్దని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నారాయణ రెడ్డి హెచ్చరించారు.

Read This Story Also: ఒళ్లు గగుర్పొడొచేలా భారత వాయుసేన ‘స్కై డైవింగ్‌’.. వీడియో చూడాల్సిందే