ఆ వేంకటేశ్వరుని దయ వలన.. పుకార్లపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఛైర్మన్..!

| Edited By:

May 21, 2020 | 4:39 PM

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కూడా జీతాల్లో కోత విధించినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి.

ఆ వేంకటేశ్వరుని దయ వలన.. పుకార్లపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఛైర్మన్..!
Follow us on

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కూడా జీతాల్లో కోత విధించినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. లాక్‌డౌన్ వలన టీటీడీ రూ.400కోట్ల నష్టాల్లో ఉందని.. తమ సొంత ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని పుకార్లు వినిపించాయి. దీంతో టీటీడీ ఉద్యోగులు ఫైర్‌ అవుతున్నట్లు కూడా టాక్‌ నడిచింది. ఈ క్రమంలో ఆ పుకార్లపై టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించి, క్లారిటీ ఇచ్చారు.

ఉద్యోగుల జీతాల్లో కోత విధించినట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని ఆయన అన్నారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ”వేంకటేశ్వర స్వామి దయ వలన ఉద్యోగులకు జీతాలు ఇచ్చేంత నిధులు టీటీడీ వద్ద ఉన్నాయి. జీతాల గురించి సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను భక్తులు నమ్మకండి. ఇప్పుడున్న పరిస్థితులు త్వరలోనే చక్కబడాలని కోరుకోండి. ఇంతవరకు జీతాలను సమయానికి ఇచ్చాము. భవిష్యత్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా జీతాలను ఇస్తాం” అని అన్నారు. కాగా కరోనా నేపథ్యంలో దాదాపుగా రెండు నెలలుగా తిరుమలకు భక్తుల రాకపై నిషేధం విధించారు. భక్తులను మాత్రమే అనుమతించడం లేదని.. రోజు స్వామి వారికి జరగాల్సిన పూజలు జరుగుతున్నాయని టీటీడీ ఇదివరకే పలుమార్లు స్పష్టం చేసింది.

Read This Story Also:  Breaking: ఇంగ్లీష్ మీడియంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..!