Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ ఎన్నికలకు పచ్చజెండా. జూన్ 19న ఎన్నికలకు ముహూర్తం ఖరారు. కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డ ఎన్నికలు. చాలా సీట్లు ఏకగ్రీవ ఎన్నిక. 18 స్థానాలకు ఏర్పడ్డ పోటీ. 18 స్థానాలకు జరగనున్న ఎన్నికలు.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం రెండు ప్యాకేజీలు. ఖాయిలా పడ్డ పరిశ్రమల కోసం రూ. 20వేల కోట్లతో ఒక ప్యాకేజి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరుతో రూ. 50వేల కోట్లతో ఈక్విటీ. కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు.
  • కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. తిరువనంతపురంలో భారీ వర్షం. వాతావరణ శాఖ అంచనాల మేరకు కదులుతున్న రుతుపవనాలు. రెండు వారాల్లో దక్షిణాది మొత్తం విస్తరించే అవకాశం.
  • కొసాగగుతున్న నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ ఏపీ ప్రభుత్వ వార్. హై కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించిన ఏపి ప్రభుత్వం. నిమ్మగడ్డ రమేష్ కేసులో మరో కీలక మలుపు. సుప్రీంకోర్టు లో ఎస్ ఎల్ పి దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పరిశీలనలో ఏపీ ప్రభుత్వ ఎస్ ఎల్ పి. ఇప్పటికే కెవియట్ పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత మస్తాన్ వలి. మస్తాన్ వలి తరపు న్యాయవాడులకి సమాచారం ఇచ్చిన సుప్రీంకోర్టు.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.

Breaking: ఇంగ్లీష్ మీడియంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..!

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
English Medium Andhra Pradesh Schools, Breaking: ఇంగ్లీష్ మీడియంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..!

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ ప్రముఖ సంస్థతో ధర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ మేరకు తాజాగా డెసిషన్ తీసుకుంది. ఈ క్రమంలో విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించేందుకు ఓ ఆంగ్ల ఛానెల్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సమగ్ర శిక్షణా అభియాన్ కింద షార్ట్ ఫిల్మ్‌లతో పాటు సర్వే చేయించాలని నిర్ణయించింది. జూన్ నెలాఖరు కల్లా వీటిని పూర్తి చేసి జూలైలో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు అభ్యంతరాలను కొత్తగా ఆదేశాలు ఇవ్వాలన్న భావనలో ప్రభుత్వం ఉంది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం.. దీనికి సంబంధించి రెండు జీవోలు తీసుకొచ్చింది. అయితే వాటిని హైకోర్టు కొట్టివేసింది. ఏ మాధ్యమంలో చదువుకోవాలనుకున్నది తల్లిదండ్రులు, విద్యార్థులే నిర్ణయించుకుంటారని తెలిపిన న్యాయస్థానం..  వారి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఇప్పటికే  ప్రభుత్వం తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించడంతో పాటు.. తమ అంగీకారాన్ని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ క్రమంలో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఈ నెల 13న ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. దాని ప్రకారం 2020-21 సంవత్సరానికి గానూ 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది. అయితే మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. ఒకవేళ అందులోని విద్యార్థులు కోరుకుంటే వారికి కూడా సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం క్లాసులను చెప్పనున్నారు. అలాగే ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లలో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం ఉండగా.. అవి యధాతథంగా కొనసాగనున్నాయి. ఇక ఆ తరువాత నుంచి ఏటా క్రమేణా 7, 8, 9, 10 తరగతులు ఇంగ్లీష్ మీడియంగా మారనున్నాయి.

Read This Story Also: కమల్ క్రేజీ సీక్వెల్‌లో ఆ ముగ్గురు హీరోయిన్లు..!

Related Tags