Visakhapatnam: మరికొన్ని గంటల్లో పెళ్లి. అంతలోనే సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు. ఇంతకీ ఆమె ఏం చేసింది..?

|

Aug 27, 2021 | 4:48 PM

కొన్ని గంటల్లో పెళ్లి. మూడుముళ్ల తతంగానికి పెద్దలంతా తరలి వచ్చే సమయం. కానీ అంతలోనే సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చింది పెళ్లి కూతురు

Visakhapatnam: మరికొన్ని గంటల్లో పెళ్లి. అంతలోనే సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు. ఇంతకీ ఆమె ఏం చేసింది..?
Bride Compliant
Follow us on

Arilova Bride Marriage twist: కొన్ని గంటల్లో పెళ్లి. మూడుముళ్ల తతంగానికి పెద్దలంతా తరలి వచ్చే సమయం. కానీ అంతలోనే సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చింది పెళ్లి కూతురు. ఇంతకీ ఆమె ఏం చేసింది..? వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుంటే కన్నవాళ్లకు చెప్పుకుంటారు. అదీ కుదరకుంటే బంధువుల ముందు చెప్పుకుని భోరుమంటారు. కానీ అత్యంత ధైర్యంగా ఈ 22 ఏళ్ల పెళ్లి కూతురు పెళ్లి పీటలపైకి ఎక్కేవేళ డయల్ 100కి కాల్ చేసి పోలీస్ కంట్రోల్‌ రూమ్‌‌కి ఫిర్యాదు చేసింది.

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు కాపాడాలని విశాఖపట్నం అరిలోవ ప్రాంతానికి చెందిన ఈ కొత్త పెళ్లి కూతురు ఇంట్లో వాళ్లకి తెలియకుండా పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. వెంటనే అలర్టయిన పోలీసులు యువతి దగ్గరికి వెళ్లి ఆమెను సేఫ్‌గా అరిలోవ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు.

ఇవన్నీ చూసి ఏం జరుగుతుందో అర్థం కాని పేరెంట్స్‌ మొత్తం మేటర్ తెలిసొచ్చేసరికి అవాక్కయ్యారు. ఎందుకిలా చేశావని కన్నకూతురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ వద్దకు వచ్చిన యువతి బంధువులు.. ఇష్టం లేకపోతే పెళ్లి మానేస్తామని ఇంటికి రావాలంటూ యువతిని కోరినప్పటికీ ఇంటికి వెళ్లేందుకు సదరు యువతి భయపడుతోంది.

ఇక, సీన్ పెళ్లి మండపం నుంచి పోలీస్ స్టేషన్‌కి మారిన నేపథ్యంలో.. అంతలోనే పెళ్లి కూతురు ఇచ్చిన సమాచారం మేరకు మహిళా సంఘాలు కూడా ఠాణాకి వచ్చేశాయి. యువతికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాయి. కానీ పెళ్లి కూతురు పెళ్లి పీటలెక్కేందుకు ససేమిరా అంది. పెళ్లి కూతురు చెప్పిన రీజన్‌ విని చివరికి మహిళా సంఘాలు కూడా యువతికే మద్దతిచ్చాయి.

ఇక, బంధువులు మాత్రం.. ‘పెళ్లి ఇష్టం లేకుంటే ముందే చెప్పాల్సింది. యువతి మాత్రం ధైర్యం చేయలేకపోయింది. చివరకు కుటుంబాన్నంతా స్టేషన్‌ మెట్లెక్కేలా చేసింది’ అంటూ వాపోయింది. కాగా, అన్నీ సక్రమంగా జరిగి ఉంటే, ఈ రోజు రాత్రి విజయనగరం జిల్లా నెలిమర్లలో యువతి వివాహం జరగాల్సి ఉంది. కాగా, సదరు యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు భోగట్టా.

Read also: TRS: జెండా పండుగ నాడు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజ, 2వ తేదీ నుంచి అన్ని సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ: కేటీఆర్