Vijayawada Durgamma Teppostavam: విజయవాడ దసరా ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు కృష్ణానదిలో జరిగే దుర్గమ్మ నదీ విహారంపై సందిగ్ధత నెలకొంది. కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఈ నెల 25న తెప్పోత్సవం నిర్వహించాలా..? లేదా..? అన్న విషయంపై దుర్గ గుడి అధికారులు డైలమాలో ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద 3 లక్షల 77 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతుండగా.. తెప్పోత్సవంకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతులిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు ఇప్పటికే దుర్గ గుడి అధికారులు హంస వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీమహాలక్ష్మి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More:
బ్లెస్సింగ్స్ ఇస్తున్న ఫాదర్‌కి చిన్నారి హై ఫైవ్ .. వీడియో వైరల్