పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది వాలంటీర్లపై వేటు.. కారణమిదే

| Edited By:

Oct 06, 2020 | 5:18 PM

పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లపై వేటు పడింది. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు

పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది వాలంటీర్లపై వేటు.. కారణమిదే
Follow us on

Grama Volunteers suspended: పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లపై వేటు పడింది. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ చేయూత పథకంలో అనర్హులను గుర్తించడంలో విఫలమైనందుకు వీరిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు, విదేశాల్లో ఉన్న వారు వైఎస్సార్‌ చేయూతకు అనర్హులు. కానీ ఆ మండలంలోని వివిధ గ్రామాల్లో అర్హత లేని 21 పేర్లను పథకంలో నమోదు చేసినందుకు వీరిపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు ఈ విషయంలో 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Read More:

మధ్యాహ్న భోజన కార్మికులు ఇవి ధరించకూడదు: కేంద్ర విద్యా శాఖ షరతులు

వివేకా హత్య కేసు విచారణకు తాత్కాలిక బ్రేక్‌