మధ్యాహ్న భోజన కార్మికులు ఇవి ధరించకూడదు: కేంద్ర విద్యా శాఖ షరతులు

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చిలో మూతపడిన విద్యా సంస్థలు అక్టోబర్ మధ్యలో నుంచి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో  కేంద్ర విద్యా శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసుకుంది.

మధ్యాహ్న భోజన కార్మికులు ఇవి ధరించకూడదు: కేంద్ర విద్యా శాఖ షరతులు
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2020 | 5:13 PM

mid-day meal workers: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చిలో మూతపడిన విద్యా సంస్థలు అక్టోబర్ మధ్యలో నుంచి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో  కేంద్ర విద్యా శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసుకుంది. పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది. గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది.‌ ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్‌లైన్స్‌ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్ తెలిపారు.

మార్గదర్శకాలివే:

  1. మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్‌ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.
  2. పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.
  3. పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.
  4. మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.
  5. నెయిల్ పాలిస్‌(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.
  6. వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.
  7.  ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.
  8. మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.
  9. కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్‌ క్లోరిన్‌తో కడగాలి.
  10. అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్‌లుగా విద్యార్థులను విభజించాలి. అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్‌లలో భోజనం వడ్డించాలి.
  11. సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో మార్కింగ్‌ ఉండాలి.
  12. భోజనం 65డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.

Read More:

వివేకా హత్య కేసు విచారణకు తాత్కాలిక బ్రేక్‌

‘అవును’ నటుడు హర్షవర్ధన్‌కి కరోనా పాజిటివ్‌

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.