బిగుస్తున్న ఉచ్చు.. జేసీ ట్రావెల్స్‌ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 3:49 PM

ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ కుటుంబానికి మరో షాక్‌ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

బిగుస్తున్న ఉచ్చు.. జేసీ ట్రావెల్స్‌ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
Follow us on

ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ కుటుంబానికి మరో షాక్‌ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా మార్చేందుకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో జేసీ వర్గీయులైన నాగేశ్వర రెడ్డి, రమేష్‌, సోమశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు ఈ ముగ్గురు నకిలీ పత్రాలను  విక్రయించినట్లు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిలను రెండు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అనంతపురం కోర్టు అనుమతిని ఇచ్చింది. దీంతో రిమాండ్‌లో ఉన్న ఆ ఇద్దరినీ కడప జైలు నుంచి అనంతపురం 1వ పట్టణ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని రెండు రోజుల పాటు అనంతపురం పోలీసులు విచారించనున్నారు. కాగా బెయిల్ కావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు చేసుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: పెను ప్రమాదంలో ఉన్నాం.. కరోనాపై మళ్లీ హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ