Viral: కట్టె పుల్లలు అనుకుంటివా అప్పా.. అవన్నీ పాములప్ప.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..

పాము గురించి వింటేనే అదో రకమైన భయం.. మరి కళ్ళ ముందు కనిపిస్తే వామ్మో.. ఇక గజ గజ వణికిపోవాల్సిందే.. అటువంటి పాములను అలవోకగా పట్టేసి వాటి బారి నుంచి జనాలను రక్షిస్తున్నారు స్నేక్ క్యాచర్లు.. అంతేకాదు పాములకు కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఒక్క ఫోన్ కొడితే చాలు.. క్షణాల్లో వాలిపోయి వారం వ్యవధిలో పదికి పైగా ఆ పాములను పట్టుకుంటున్నారు. వాటిలో అయిదు నాలుగు పాములు విషపూరితమైన కింగ్ కోబ్రాలు, మరికొన్ని జెర్రి గుడ్డులు పట్టుకున్నారు విశాఖలోని స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్..

Viral: కట్టె పుల్లలు అనుకుంటివా అప్పా.. అవన్నీ పాములప్ప.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..
Snakes

Edited By:

Updated on: Mar 19, 2026 | 9:26 AM

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదికి పైగా పాములు .. జనావాసాల్లో సంచరిస్తున్న పాములను  విశాఖకు చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ పట్టుకున్నారు. విశాఖ నగరంలోని కూర్మన్నపాలెం, అగనంపూడి సహా మరికొన్ని ప్రాంతాల్లో పాములను రెస్క్యు చేశాడు. వాటిలో అత్యంత విషపూరితమైన అయిదు భారీ నాగు పాములు. మరికొన్ని నాగ జెర్రీలు. ఒక్కొక్కటి దాదాపుగా 6 నుంచి 8 అడుగుల పొడవున్నయి. వీటినే ర్యాట్ స్నేక్స్, జెర్రి గుడ్లు అని కూడా అంటారు. విష రహిత పాముల్లో ఒక జాతి అయిన ఈ రాట్ స్నేక్స్ తో పాటు అత్యంత విషపూరితమైన నాగుపాములను కూడా పట్టుకొని అడవుల్లో వదిలాడు కిరణ్.

అయితే ఇవన్నీ ఒకేసారి కట్టలుగా పట్టుకొని వదిలేందుకు తీసుకొచ్చాడు. చేతి నుంచి వేలాడుతూ కట్టలుగా ఉన్న పాములను రెస్క్యూ చేసి విడిచి పెడుతున్నట్టు వీడియో తీశారు అతని టీం మేట్స్. ఆ వీడియోలో కట్టలుగా ఉన్న పాములను చూస్తే ఒళ్ళు వణుకు పుట్టక తప్పదు. ముందుగా నాగుపాములను విడిచిపెట్టాడు. ఆ తర్వాత సంచిలో ఉన్న జెర్రీ గుడ్డులను చేయి పెట్టి కట్టలుగా.. కింద వదిలాడు. దీంతో అవన్నీ జర్రున పాకుకుంటూ పొదల్లోకి వెళ్లిపోయాయి.

వీడియో చూడండి..

జీవవైవిద్యాన్ని పరిరక్షించే పాములు కనిపిస్తే హాని తలపెట్టకుండా తమకు సమాచారం ఇవ్వాలని అంటున్నాడు కిరణ్ కుమార్. ఇప్పటికే వేల సంఖ్యలో పాములను రెస్క్యూ చేసి అడవుల్లో విడిచిపెట్టి వాటికి రక్షించడంతోపాటు.. మనుషుల ప్రాణాలను పాముల వారి నుంచి రక్షించేందుకు కూడా సర్వీస్ చేస్తున్నాడు కిరణ్. దీంతో అతని సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు కూడా ఎంపిక చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us