Tirumala News: లింక్ రోడ్డు మీదుగా తిరుమలకు వాహనాల అనుమతి.. నెలాఖరులోగా ఘాట్‌ రోడ్‌ మరమ్మతులు..

|

Dec 04, 2021 | 7:39 AM

Tirumala News: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్‌ ఘాట్‌ రోడ్డులో రోడ్డు ధ్వంసమైన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు ధ్వంసంకావడంతో పాటు రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రస్తుతం..

Tirumala News: లింక్ రోడ్డు మీదుగా తిరుమలకు వాహనాల అనుమతి.. నెలాఖరులోగా ఘాట్‌ రోడ్‌ మరమ్మతులు..
Tirumala
Follow us on

Tirumala News: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్‌ ఘాట్‌ రోడ్డులో రోడ్డు ధ్వంసమైన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు ధ్వంసంకావడంతో పాటు రక్షణ గోడలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రస్తుతం టీటీడీ అధికారులు పునఃనిర్మాణ పనులపై దృష్టిసారించారు. యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి నిర్మాణ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ధ్వంసం కావడంతో ప్రస్తుతం తిరుమలకు వెళ్లే వాహనాల రాకపోకలు డౌన్‌ ఘాట్‌ రోడ్డు నుంచే సాగుతున్నాయి. అయితే ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండడంతో మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రోడ్డు పునఃనిర్మాణం విషయమై తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్ ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండ చరియలోని మిగిలిన భాగం రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల భద్రతే ముఖ్యమని.. ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు.

ఇదిలా ఉంటే అప్‌ ఘాట్‌ రోడ్డు ధ్వంసమైన నేపథ్యంలో.. డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాక పోకలు సాగుతున్నందువల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమలలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్న సుబ్బారెడ్డి.. భక్తుల ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Also Read: New Dinosar: అమ్మో ఇది మహా డేంజర్.. ఇలాంటి డైనోసార్‌ను ఎన్నడూ చూడలేదంటున్న శాస్త్రవేత్తలు..!

Viral Video: పెళ్లి దుస్తుల్లో కళ్లముందు తళుక్కుమన్న స్వప్న సుందరి.. బోరున ఏడ్చిన వరుడు.. ఫన్నీ వీడియో మీకోసం..!

Lucky Lottery : అదృష్టం అంటే ఇదే మరి.. స్నేహితుడు పంపిన గెట్‌వెల్‌ కార్డ్‌లో 7 కోట్ల లాటరీ కోట్లలో లాటరీ!