Andhra Pradesh: మరో 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే..?

పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో.. ఇప్పుడు చావు కబురు వినాల్సి వచ్చింది. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న ఆ యువకుడి నూరేళ్ల ఆయువును ఆ కరెంట్ తీగలు హరించేశాయి. నిన్నటి వరకు పెళ్లి పనులతో సందడిగా ఉన్న ఆ ఇంట.. ఇప్పుడు గుండెలు పగిలే రోదనలు మిన్నంటాయి. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: మరో 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే..?
Groom Electrocuted While Doing House Repairs

Edited By:

Updated on: Nov 17, 2026 | 8:10 PM

కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువకుడు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి ఏర్పాట్లతో కళకళలాడాల్సిన ఆ ఇంట ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. కళ్లముందే కొడుకు విగతజీవుడిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాపట్ల జిల్లా మార్టూరు పట్టణ పరిధిలోని ఆది జాంబవ కాలనీలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వచ్చే నెల 13న పెళ్లి జరగాల్సి ఉండగా, పెద్దకర్ని యశ్వంత్ (22) అనే యువకుడు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. కొత్త పెళ్లికూతురు అడుగుపెట్టబోయే తమ ఇల్లు అన్ని హంగులతో, సౌకర్యాలతో మెరుగ్గా ఉండాలని యశ్వంత్ భావించాడు. ఇందులో భాగంగానే స్వయంగా తానే ఇంటికి అవసరమైన మరమ్మతు పనులు ప్రారంభించాడు.

ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ ఐరన్ పైపు విద్యుత్ తీగలకు తగిలింది. క్షణాల వ్యవధిలో యశ్వంత్ తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడంతో ఏం చేయాలో పాలుపోక వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

శోకసముద్రంలో కుటుంబ సభ్యులు

నిన్నటి వరకు బంధుమిత్రుల రాకతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఆ ఇల్లు ఇప్పుడు ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది. పెళ్లి బాజాలు మోగాల్సిన చోట ఏడ్పులు, రోదనలు వినిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే నూరేళ్ల జీవితాన్ని చూసి కలలుకన్న యశ్వంత్ అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us