Rain Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయి. అయితే గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు. మీ ప్రాంత వాతావరణ సూచనలు ఇక్కడ తెలుసుకోండి.

Rain Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Weather Report

Updated on: May 08, 2026 | 3:00 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.. ఇటీవల 45 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి/గాలుల అంతరాయం ఇప్పుడు కొమొరిన్ ప్రాంతం నుండి, విదర్భ, మరాఠ్వాడ, అంతర కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంద.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి/ గాలి విచ్చితి ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని నైరుతి ప్రాంతం నుండి విదర్భ, మరత్వాడ, అంతర్గత కర్నాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast) శుక్రవారం, శనివారం, ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings): ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు – ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us