Andhra Pradesh: ప్లాస్టిక్ బియ్యం వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇదీ వాస్తవం అంటున్న ఆహార నిపుణులు..

|

Sep 14, 2021 | 8:06 AM

Andhra Pradesh: రేషన్ బియ్యం సరఫరాలో ప్లాస్టిక్ బియ్యం వస్తోందా?.. అంగన్వాడీ కేంద్రంలో అందించే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తోందా?.. లేక ఇదంతా అపోహనా?.. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి..

Andhra Pradesh: ప్లాస్టిక్ బియ్యం వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇదీ వాస్తవం అంటున్న ఆహార నిపుణులు..
Jc Prabhakar Reddy
Follow us on

Andhra Pradesh: రేషన్ బియ్యం సరఫరాలో ప్లాస్టిక్ బియ్యం వస్తోందా?.. అంగన్వాడీ కేంద్రంలో అందించే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తోందా?.. లేక ఇదంతా అపోహనా?.. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఇలాంటి ఆరోపణలు చేస్తే ఏమనాలి? అసలు ఇది ప్లాస్టిక్ రైసా?.. కాదా?.. అసలు ఎందుకిలా ప్రచారం జరుగుతోంది?.. ఎందుకిలా ప్రచారం చేస్తున్నారు? జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్ట్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉందా?.. నిపుణులు ఏమంటున్నారు? ఇలాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్లాస్టిక్ రైస్… ఇది ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యంలోనూ, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే బియ్యం పంపిణీ జరుగుతోందా అంటే.. ఇందులో నిజం లేకపోయిునా ప్రచారం బాగా జరుగుతోంది. ఇటీవలి కాలంలో అనంతపురం జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో కల్తీ అయిన ప్లాస్టిక్ బియ్యం సరఫరా అవుతున్నట్లు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాడిపత్రిలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండడంతో చిన్నారుల తల్లిదండ్రులు మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి కి సమాచారం ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్లాస్టిక్ బియ్యాన్ని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం సరఫరా చేస్తున్నవారిపై కోర్టుకు వెళ్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. చిన్న పిల్లలు ప్లాస్టిక్ అన్నం తిన్న తర్వాత ఆస్పత్రి పాలైతే వైద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి డబ్బులు కూడా సరిపోవని తాడిపత్రి ప్రజలకోసం తాను ఎవరితోనైనా పోరాటం చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

అయితే ఇలాంటి వార్తలపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు పంపిణీ చేసే బియ్యం ప్లాస్టిక్ రైస్ కాదని చెప్పారు. ఇది అన్ని మినరల్స్ ఉన్న ఫోర్టిఫైడ్ రైస్ అని చెబుతున్నారు. ఇవాళ ఇదే అంశంపై విశ్రాంత ఫుడ్ ఇన్స్‌పెక్టర్ కరీముల్లా పరిశోధన చేసి అది ప్లాస్టిక్ రైస్ కాదని చెప్పారు. విటమిన్లు, ఇతర ఖనిజాలు కలిపి ఫోర్టిఫైడ్ రైస్ తయారవుతోందన్నారు. ఈ బియ్యం ద్వారా సూక్ష్మ పోషకాలు అందతాయని వారు చెబుతున్నారు. అయితే ఈ బియ్యం కొంత ప్లాస్టిక్ రూపాన్ని పోలి ఉండటంతో ప్రజలు అలా అనుకుంటారని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఇది పూర్తి సురక్షితమైందని చెప్పారు. ఇలాంటి అపోహలకు చెక్ పడాలంటే.. ముందుగా ప్రజల్లో అవగాహన తేవాల్సిన అవసరం ఉందని, ప్రజలకు అవగాహన లేకపోవడం వలన సమస్య వస్తోందన్నది సుప్పష్టమవుతోందంటున్నారు.

Also read:

Viral Video: అంతా రివర్సులో జరిగింది.. కుక్కను కాపాడటానికి పిల్లి.. ఈ వీడియోను చూస్తే మీరు షాక్‌ అవుతారు

Sai Dharam Tej Accident: హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. కన్‌స్ట్రక్షన్ కంపెనీపై భారీ జరిమానా..

4 ఓవర్లలో 4 మెయిడెన్స్‌తో 4 వికెట్లు! ప్రత్య‌ర్థికి చుక్కలు చూపించిన మహిళా బౌలర్.. టీ20 బెస్ట్ బౌలింగ్ అంటూ నెటిజన్ల పొగడ్తలు